Home Entertainment Cinema

పవన్ కళ్యాణ్ చేతిపై టాటూ.. మొఘలుల కాలం నాటి గద్ద..

నిన్న మొన్నటి వరకు గడ్డం మీసాలతో కనిపించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. ఈయన కొత్త లుక్ చూసి అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. పూర్తిగా సినిమా హీరోలా మారిపోయాడు ఈయన. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కోరమీసాలు.. ఆ లుక్ చూస్తుంటే అభిమానులు ఫిదా కాకుండా ఉండలేకపోతున్నారు. ఈ లుక్ లో పవన్ బాగున్నాడంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కెరీర్లో ఇప్పటివరకు టాటూల జోలికి వెళ్ళలేదు పవన్ కళ్యాణ్. సినిమా కోసం కూడా ఎప్పుడూ ఆయన టాటూ వేయించుకోలేదు.

కానీ ఇప్పుడు మాత్రం ఆయన చేతి పై ఒక టాటూ కనిపిస్తుంది. సినిమా కోసం ఈ టాటూ వేయించుకున్నాడు పవర్ స్టార్. ఓ మీటింగ్ లో మాట్లాడుతున్నప్పుడు పవన్ కొత్త లుక్ బయటకు వచ్చింది. ఆయన చెయ్యెత్తి మాట్లాడుతున్నప్పుడు దానిపై ఉన్న టాటూ కూడా కనిపించింది. సాధారణంగా పవన్ ఇలాంటి టాటూలు వేసుకోరు. కానీ ఇప్పుడు వేయించుకున్నాడు అంటే సినిమా కోసమే అనేది అర్థం అవుతుంది. అందులోనూ పింక్ సినిమా కోసం టాటూ అవసరం లేదు. ఎందుకంటే ఆ సినిమాలో ఆయన లాయర్ పాత్రలో నటిస్తున్నాడు. దాంతో ఇది కచ్చితంగా క్రిష్ సినిమా కోసమేనని అంటున్నారు విశ్లేషకులు. ఆ టాటూ గద్దను పోలి ఉండగా.. మొగలుల కాలంలో బందిపోట్లు ఇలాంటి పచ్చబొట్లు వేసుకునేవారని తెలుస్తోంది.

ఈ సినిమాలో పవన్ బందిపోటు పాత్రలో నటిస్తున్నాడని ఇప్పటికే టాక్ బయటకు వచ్చింది. ఇప్పుడు టాటూని చూసి కన్ఫామ్ చేసుకుంటున్నారు అభిమానులు. ఎ.ఎం.రత్నం నిర్మిస్తోన్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ముందు సంక్రాంతికి విడుదల చేయాలనుకున్న కూడా అప్పుడు రాజమౌళి ఉండటంతో కాస్త వెనక్కి తగ్గుతున్నారు పవన్ కళ్యాణ్, క్రిష్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here