Home News Politics

జేడీ లక్ష్మీనారాయణ ఆ విషయాలు కూడా చెప్పి ఉండాలసింది: జేడీ రాజీనామాపై పవన్ కళ్యాణ్ స్పందన

వీ వీ లక్ష్మీనారాయణ రాజీనామాపై స్పందించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే జేడీ లక్ష్మీనారాయణ అన్నివిషయాలు ప్రస్తావించి ఉంటె బాగుండేదని అన్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ స్పందన ఏమిటంటే…

లక్ష్మీనారాయణ గారి రాజీనామాను జనసేన ఆమోదిస్తోంది… నాకు సిమెంట్ ఫ్యాక్టరీస్, గనులు, పాల కంపెనీలు, ప్రాజెక్టులు ఏవీ లేవు… నాకు తెలిసిందల్లా కేవలం సినిమా చేయడమే.. ఈ రంగం పై ఎందరో జీవిస్తున్నారు. వారికి ఇదే జీవనాధారం. అందుకే సినిమాలు చేయాలనీ నిర్ణయించుకున్నాను..

ఈ విషయాలు అన్నీ లక్ష్మీనారాయణ గారు తన లేఖలో పేర్కొని ఉంటె బాగుండేది. అయితే ఆయన మీద నాకు, జనసైనికులకు గౌరవం అలాగే ఉంటుంది.. ఆయనకు శుభాభినందనలు అని పవన్ కళ్యాణ్ తెలిపారు.