Home Entertainment Cinema

పవన్ కళ్యాణ్ పాట వచ్చేస్తుంది.. గెట్ రెడీ ఫ్యాన్స్..

అప్పుడెప్పుడో 2018 జనవరిలో అజ్ఞాతవాసి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత మళ్లీ ఆయన పూర్తిగా మాయమైపోయాడు. రెండేళ్లకు పైగా రాజకీయాలు చేశాడు. ఎన్నికల్లో దారుణమైన ఓటమి తర్వాత మరో 4 ఏళ్ల వరకు ఎటూ ఏం చేయలేని పరిస్థితిలో పడిపోయాడు. అందుకే వచ్చే ఎన్నికల నాటికి 500 కోట్లకు పైగా సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకొని వరుస సినిమాలు చేస్తున్నాడు పవర్ స్టార్. ఈ వచ్చిన మొత్తాన్ని జనసేన పార్టీ అభివృద్ధి కోసం ఖర్చు చేయబోతున్నాడు పవన్ కళ్యాణ్.

ఇదిలా ఉంటే ఈయన సినిమా నుంచి తొలి పాట ఫిబ్రవరి 27న విడుదలవుతుంది. ప్రస్తుతం ఆయన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ సినిమా రీమేక్ చేస్తున్నాడు. ఇందులో లాయర్ పాత్రలో నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఒకసారి ఆయన నల్లకోటు వేసుకున్న తర్వాత తీసుకోవడానికి బెయిలు అసలు ఉండదు. ఒకసారి ఆయన కేస్ టేకప్ చేస్తే ఇక అవతలి వాళ్ళ పరిస్థితి అంతే సంగతులు. గెలిచే వరకు దాన్ని వదిలిపెట్టడు. అలాంటి ఒక టిపికల్ పాత్రలో పవన్ నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా నుంచి తొలి సింగిల్ ఫిబ్రవరి 27న వస్తుంది.

ఇది తెలుసుకున్న అభిమానులు గాల్లో తేలిపోతున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ సినిమాకు ఒక్కసారి పని చేయలేదు ఈయన. రాకరాక వచ్చిన అవకాశం కావడంతో పవన్ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేస్తున్నాడు తమన్. అల వైకుంఠపురంలో సినిమాతో ఈ మధ్యే సెన్సేషనల్ బ్లాక్బస్టర్ అందుకున్న తమన్ ఇప్పుడు పవన్ సినిమాకు కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నాడు. ఏదేమైనా పవన్ సినిమా మొన్ననే మొదలుపెట్టి అప్పుడే మొదటి పాట విడుదల చేస్తున్నారు దిల్ రాజు. ఈ సినిమాని బోనీ కపూర్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాడు దిల్ రాజు. మే 15న పింక్ రీమేక్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here