Home Entertainment Cinema

పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌తో పవన్ కల్యాణ్, క్రిష్ సినిమా..

పవన్ కల్యాణ్ సినిమాలు చేయడమే గొప్ప విషయం.. అయితే ఆయన సినిమాలు చేస్తున్నా కూడా ఆసక్తి లేకుండా చేస్తున్నాడంటూ అభిమానులు కూడా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి సమయంలో సినిమాలు చేయడం కంటే కూడా ఎందుకు చేస్తున్నాడు అంటూ విసుగ్గుకుంటున్నారు కూడా. అయితే ఇలాంటి సమయంలో క్రిష్ సినిమాను మొదలుపెట్టే సరికి ఫామ్ లో లేని దర్శకులతో ఎందుకు పని చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో సెటైర్లు కూడా పేలుతున్నాయి.

కానీ క్రిష్ సినిమా కమర్షియల్ కంటే కూడా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ అని తెలిసి ఇప్పుడు షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. ఈ చిత్రం కథ స్వాతంత్య్రానికి పూర్వం జరిగిందని.. అప్పటి కథతో క్రిష్ సినిమా చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇందులో పవన్ బందిపోటుగా కనిపిస్తాడనే ప్రచారం అయితే జోరుగానే జరుగుతుంది. ఇదంతా విని అభిమానులు అయితే ఉప్పొంగిపోతున్నారు కానీ నిజంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు అంత ఓపిక ఉందా.. అంత కష్టపడతాడా అనే వాళ్లు కూడా లేకపోలేదు.

ఎందుకంటే పగలు రాజకీయాలు చేసుకుంటూ రాత్రుళ్లు షూటింగ్ చేసుకుంటున్నాడు పవర్ స్టార్. ఇలాంటి సమయంలో పీరియాడికల్ సినిమా అంటే చిన్న విషయం కాదు. చాలా కష్టపడాల్సిందే.. సైరా కోసం చిరంజీవి.. ఇప్పుడు అల్లూరి పాత్ర కోసం చరణ్ ఎంత కష్టపడ్డారో చెప్పాల్సిన పనిలేదు. మరి పవన్ ఇలా కష్టపడతాడా చూడాలిక. కెరీర్ లో తొలిసారి ఇలాంటి పాత్రలో నటించబోతున్నాడు పవన్ కళ్యాణ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here