Home Entertainment Cinema

పవన్ కల్యాణ్ తో కన్నడ నటుడు సుదీప్ భేటీ! ఎందుకో తెలుసా?

జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ని ప్రముఖ నటులు, కన్నడ కథానాయకుడు సుదీప్ మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ఉదయం హైదరాబాద్ లోని పవన్ కల్యాణ్ కార్యాలయానికి సుదీప్ వచ్చారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కి మొక్కలు బహూకరించారు. వారిద్దరి మధ్య సుమారు గంట సేపు సంభాషణ సాగింది.

కోవిడ్ అన్ లాక్ నేపథ్యంలో ఇటీవలే సినిమా చిత్రీకరణలు మొదలయ్యాయి… ఈ క్రమంలో తాను నటిస్తున్న చిత్రాల గురించి సుదీప్ గారు వివరించారు. కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్స్ చేయడంపై వారిద్దరూ మాట్లాడుకున్నారు. వర్తమాన, సామాజిక అంశాలపై ఆలోచనలను పంచుకున్నారు. ఆసక్తికర అంశం ఏమిటంటే… ఇద్దరి జన్మదినం సెప్టెంబర్ 2వ తేదీ కావడం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here