Home Entertainment Cinema

పవన్ కళ్యాణ్ అప్పుల పాలయ్యాడా.. అందుకే వరస సినిమాలు..?

పవన్ కళ్యాణ్‌కు ఇన్ని రోజులు రాజకీయాలు తప్ప మరో ధ్యాస లేదు.. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు చూస్తుంటే సినిమాలు తప్ప మరో ప్రపంచం లేదు. అప్పట్లో అన్నయ్య చిరంజీవి చెప్పినట్లుగానే ఓ వైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు సినిమాలు కూడా చేస్తున్నాడు పవన్. అయితే మరీ ఇంత వేగంగా వరస సినిమాలు చేస్తాడని మాత్రం ఎవరూ ఊహించలేదు. అయితే పవన్ తీసుకున్న ఈ నిర్ణయం వెనక అసలు కారణాలు కూడా చాలానే ఉన్నాయి. నిజానికి పవన్ కు ఇప్పుడు సినిమాలు చేయాలని అస్సలు లేదు.. కానీ చేయక తప్పడం లేదు.. అలాంటి పరిస్థితుల్లో పడిపోయాడు ఈయన. సినిమాలు తప్ప మరో ఆదాయం లేని పవన్.. పార్టీని నడపాలంటే సినిమాలు చేయాల్సిందే. అందుకే గతంలో తాను అడ్వాన్సులు తీసుకున్న నిర్మాతలందరికీ సినిమాలు చేసి పెడుతున్నాడు పవర్ స్టార్. పైగా కొన్నేళ్లుగా రాజకీయాలతో బిజీగా ఉన్న ఈయన..

జనసేన దారుణంగా ఓడిపోవడం.. ఎమ్మెల్యేగా కూడా గెలవకపోవడంతో అక్కడ చేసేదేం లేదు. అందుకే ఒకేసారి అన్ని సినిమాలు మొదలుపెట్టి అందరి లెక్కలు సెట్ చేయాలని చూస్తున్నాడు. ప్రతీ సినిమాకు భారీ పారితోషికం అందుకుంటున్నాడు పవన్. అలా అయితేనే కమిట్మెంట్ కూడా ఇస్తున్నాడు. దానికి తగ్గట్లుగానే వేగంగా కూడా సినిమాలు పూర్తి చేస్తానని చెబుతున్నాడు. సినిమాలతో పాటు అవసరం వచ్చినపుడు రాజకీయాలు కూడా చేస్తానంటున్నాడు. జనసేన ఎప్పుడూ అందరికీ అండగా ఉంటుందని హామీ ఇస్తున్నాడు పవర్ స్టార్. ప్రస్తుతం ఈయన అందులో పింక్ రీమేక్ తో పాటు క్రిష్ సినిమాలు సెట్స్‌పైకి తీసుకొచ్చాడు.

ఈ రెండు సినిమాల తర్వాత హరీష్ శంకర్ సినిమా పట్టాలెక్కనుంది. వీలైనంత త్వరగా ఈ మూడు సినిమాలను పూర్తి చేయాలని చూస్తున్నాడు. దాంతో పాటు మరో రెండు సినిమాలు కూడా ఉండబోతున్నాయి. ఒకటి సర్దార్ ఫేమ్ బాబీ.. మరొకటి కాటమరాయుడు ఫేమ్ డాలి తెరకెక్కించనున్నారని తెలుస్తుంది. ఈ ఇద్దరూ గతంలో తనతో పని చేసిన దర్శకులు కావడంతో పవన్ కూడా కన్వినియంట్ గా ఫీల్ అవుతున్నాడు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కూడా ఉండబోతుందనే ప్రచారం అయితే జరుగుతుంది. కానీ ఎప్పుడుంటుందో మాత్రం తెలియడ లేదు. తన రీ ఎంట్రీతో అందరి అప్పులతో పాటు నిర్మాతల అడ్వాన్సుల లెక్కలు కూడా తీర్చబోతున్నాడు ఈయన. ముఖ్యంగా జనసేన ఎన్నికల సమయంలో సోషల్ మీడియా ప్రచారం కోసం ఓ అమెరికా కంపెనీతో ఒప్పందం చేసుకుందని.. అప్పుడు ఆ బ్యాంక్ ఇచ్చిన అప్పు తీర్చడానికే పవన్ ఇప్పుడు ఇలా వరస సినిమాలు చేస్తున్నాడనే ప్రచారం కూడా జరుగుతుంది. ఏదేమైనా కూడా వరస సినిమాలు చేయడం ఆనందంగానే ఉన్నా.. క్రేజీ దర్శకులతో చేస్తే మాత్రం మరింతగా అదిరిపోతుంది. కానీ పవన్ అలా చేయడం లేదు.. పేరున్న దర్శకులతో కాకుండా చిన్న వాళ్లతోనే వరస సినిమాలు చేస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here