జనసేన అధినేత పవన్ కళ్యాన్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగానే బరిలోకి దిగాలని రాజనీతి శాస్త్రవేత్త ప్రొ హరగోపాల్ తెలిపారు. తెలుగుపాపులర్ టీవీ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అయన మాట్లాడుతూ పవన్ కళ్యాన్ తాను సిఎం అవడానికి రాజకీయాల్లోకి రాలేదని చెబుతున్నారని, ఇది ఆయనకు దెబ్బతీస్తుందని అన్నారు.
పవన్ కళ్యాన్ సిఎం గా బరిలో లేనప్పుడు ఎందుకు జనసేనకి ఓట్లు వేయాలని ప్రజలు భావిస్తారని, అందువల్ల పవన్ కళ్యాన్ ని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా చూపించాలని హరగోపాల్ అభిప్రాయపడ్డారు.