Home News Politics

వెంకన్న కోసం జనసేనాని పోరాటం

వెంకన్న కోసం జనసేనాని పోరాటం

pawan kalyan on ttd venkanna pink diamond
pawan kalyan on ttd venkanna pink diamond

పవన్ కళ్యాన్ ఈ నెల 26 నుంచి తిరిగి మొదలయ్యే ప్రజా పోరాట యాత్రలో వెంకన్న అంశాన్ని ప్రధానంగా తీసుకునే అవకాశం ఉంది.ఈ మధ్య వివిధ కారణాల వల్ల యాత్రకు బ్రేక్ ఇచ్చిన జనసేనాని విశాఖ నుంచి తిరిగి యాత్ర ప్రారంభించాబోతున్నారు. ఈ మధ్య వెంకన్న ఆభరణాలు, రమణ దీక్షితులు అంశాలు తిరుమల పవిత్రతపై తీవ్ర ప్రభావం పడ్డాయి.

తాజాగా పవన్ కళ్యాన్ తిరుమల అంశంపై తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోబోతున్నట్లు తెలిపారు. భరణాలపై సీబీఐ విచారణ జరపాలని ఇందుకోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేట్లు వైసీపీ, తెలుగు దేశం పార్టీలు ఏం చేస్తాయో దేశమంతా ఆశక్తిగా ఎదురు చూస్తోందని తెలిపారు. వెంకన్న పింక్ డైమండ్, ఇతర ఆభరణాలు మాయమవడంపై వైసీపీ, తెలుగు దేశం పార్టీలు ఏమీ పట్టనట్లు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. దొంగిలించిన వారు, సాయం చేసినవారు అంతా నరకానికి వెళ్తారని పవన్ తెలిపారు.

ఇదిలా ఉండగా విశాఖా నుంచి జరిగే యాత్రలో స్థానిక అంశాలాతో పాటుగా రాష్ట్రంలోని ఇటువంటి ప్రధాన వర్తమాన అంశాలపై ప్రసంగం ఉండేట్లు జాగ్రత్తపడబోతున్నారు జనసేనాని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here