Home News Politics

హీరో చెప్పినా ఫ్యాన్స్ విన‌రా?!

ప‌వ‌ర్‌స్టార్ మాజీ భార్య‌కు టార్చ‌ర్‌

 

ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కేం. మ‌గ మ‌హారాజు. ల‌క్ష‌ల‌మంది అభిమానులున్న ప‌వ‌ర్‌స్టార్‌. ఆయ‌నేం చేసినా ఒప్పే. ముచ్చ‌ట‌గా మూడో పెళ్లి చేసుకున్నా ఆయ‌న్నెవ‌రూ త‌ప్పుప‌ట్ట‌రు. ఎందుకంటే రెండోభార్య‌తో ఎప్పుడో తెగ‌దెంపులు అయిపోయినా ఆమె పిల్ల‌లిద్ద‌రినీ వెంటేసుకుని తిరిగేంత విశాల హృద‌యం ఈ ప్ర‌పంచంలో గ‌బ్బ‌ర్‌సింగ్‌కి కాకుండా ఇంకెవ‌రిక‌న్నా ఉంటుందా? ఆయ‌నేం చేసినా (సినీ)లోక క‌ళ్యాణంకోస‌మే.

భ‌ద్రితో ప‌రిచ‌య‌మైన రేణూదేశాయ్ మెళ్లో మూడుముళ్లేశాడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌. వారిద్ద‌రి దాంప‌త్య జీవితానికి గుర్తుగా ఇద్ద‌రు పిల్ల‌లు. కానీ ఎక్క‌డ‌చెడిందో, ఎందుకు అంత‌దూర‌మొచ్చిందోగానీ రేణూదేశాయ్‌కి విడాకులిచ్చేసి ర‌ష్య‌న్ అమ్మాయిని ముచ్చ‌ట‌గా మూడోపెళ్లి చేసుకున్నాడు. విడిపోయినా ఇద్ద‌రి మ‌ధ్యా అండ‌ర్‌స్టాండింగ్ ఉంద‌నేందుకు అప్పుడ‌ప్పుడూ ఆమె పిల్ల‌ల‌తో క‌నిపిస్తూనే ఉన్నాడు.

రేణూదేశాయ్‌కి ప‌వ‌న్ ఎందుకు దూర‌మ‌య్యాడ‌నేదానిపై ఎన్నో ప్ర‌చారాలు. ఎక్క‌డో తేడాగొట్టింది. వ‌దిలేశాడంతే. క‌లిసి కొట్టుకునేకంటే..విడిపోయి అప్పుడ‌ప్పుడు ప‌ల‌క‌రించుకుంటేనే మంచిద‌నుకుని రేణూదేశాయ్ కూడా ప‌వ‌ర్‌స్టార్ జీవితంనుంచి గౌర‌వంగా త‌ప్పుకుంది. ఎప్పుడూ అత‌న్ని త‌ప్పుప‌ట్టేలా ఒక్క మాటా మాట్లాడ‌లేదు. పైగా కొన్ని సంద‌ర్భాల్లో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో త‌న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కంట‌త‌డిపెట్టింది. సో..త‌నేం ప‌వ‌న్‌ని ద్వేషించ‌డంలేదు. అనివార్య ప‌రిస్థితుల్లో ఇద్ద‌రూ విడిపోయారంతే.

ముచ్చ‌ట‌గా మూడోపెళ్లాంతో మ‌రో బిడ్డ‌కు తండ్ర‌య్యాడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌. త‌ను సంసార సాగ‌రంలో లాహిరి లాహిరి లాహిరిలో అంటూ షికారుచేస్తుంటే… రేణూదేశాయ్ మాత్రం ఒంట‌రిత‌నంతో క్షోభ అనుభ‌విస్తోంది. త‌న‌కూ ఓ తోడుకావాల‌నుకోవ‌డ‌మే ఆమె మ‌హాప‌రాధ‌మైపోయింది. త‌న జీవితంలోకి ఓ భాగ‌స్వామి వ‌స్తున్నాడ‌ని ఆమె చెప్ప‌డ‌మే ఆల‌స్యం..వీరంగం వేస్తున్నారు ప‌వ‌న్ ఫ్యాన్స్.

పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ మరోసారి అతడి ఫ్యాన్స్ కు గట్టిగా క్లాస్ పీకింది. ఇంకా చెప్పాలంటే ఈసారి ఇంకాస్త డోసు పెంచిందామె. ఎక్కువగా రెచ్చిపోతే నిజాలు మాట్లాడాల్సి వస్తుందని, అప్పుడు ఫ్యాన్స్ అందరూ మూసుకుంటారని హెచ్చరించింది. ప‌వ‌న్ ఫ్యాన్స్ టార్చ‌ర్ భ‌రించ‌లేక ఆమె సోష‌ల్‌మీడియా ఎకౌంట్స్ క్లోజ్ చేసుకోవాల్సి వ‌చ్చింది.

అభిమానులు ఇల్లుపీకి పందిరేసేలా ఉన్నార‌ని…స్వ‌యానా ప‌వ‌న్‌క‌ళ్యాణే రేణూదేశాయ్‌కి ఆల్‌దిబెస్ట్ చెప్పినా న్యూసెన్స్ మాత్రం ఆగ‌లేదు. మ‌రో పెళ్లి చేసుకోవ‌డం ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ్య‌క్తిగ‌త‌మైతే..రేణూదేశాయ్‌కి కూడా ఆ స్వేచ్ఛ ఉంది. త‌మ హీరో మ‌రో పెళ్లి చేసుకున్నా…ఆయ‌న మాజీ భార్య‌లు మాత్రం ఒంట‌రిగా ఆయ‌న ఆలోచ‌న‌ల్లోనే జీవితం గ‌డ‌పాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్న‌ట్లుంది.

స‌హ‌నానికైనా ఓ హ‌ద్దుంటుంది. త‌న వ్య‌క్తిగ‌త జీవితంలోకి జొర‌బ‌డితే రేణూదేశాయ్ కూడా మౌనంగా ఉండ‌దు. ప‌వ‌న్‌తో ఎందుకు విడిపోవాల్సి వ‌చ్చిందో తాను చెప్ప‌డం మొద‌లుపెడితే గుండె ఆగి చ‌స్తార‌ని ఫ్యాన్స్‌కి ఇప్ప‌టికే సంకేతాలిచ్చింది రేణూ. త‌న మాజీ భార్య‌ని ఒక్క మాట‌న్నా త‌న మీద ఒట్ట‌ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గ‌ట్టిగా చెబితేగానీ ఫ్యాన్స్ రంకెలు ఆగేలా లేవు. వాళ్ల‌ని కంట్రోల్ చేసుకోక‌పోతే…మునిగేది ప‌వ‌న్ కొంపే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here