Home Entertainment Cinema

పవన్ హరిహర వీరమల్లు గ్రాఫిక్స్ పై టాలీవుడ్ లో ఆసక్తికర చర్చ

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో దాదాపు మూడేళ్ల తర్వాత భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ హిట్ తర్వాత వరుస సినిమాలు కమిట్ అయిన పవన్ డైరక్టర్ క్రిష్ తో ఓ భారీ పిరియాడికల్ డ్రామా మూవీ ప్లాన్ చేశారు. దాదాపు 180 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని పలు భాషల్లో రిలీజ్ కి రెడీ చేస్తున్నారు మేకర్స్. మొగల్ సామ్రాజ్యం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చార్మినార్, ఎర్రకోటతో పాటు మొగలాయీల సామ్రాజ్యపు ప్రాంగణాన్ని నిర్మించబోతున్నారట దీనికి దాదాపు 30 కోట్లు ఖర్చు పెడుతున్నారట. ఇప్పుడిదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం పవన్ చెయ్యాల్సిన సినిమాలన్నీకరోనా కారణంగా షూటింగ్ పోస్ట్ పోన్ చేసుకున్నాయి. అయితే క్రిష్ మూవీలో చాలావరకు సెట్స్ లోనే నిర్మితమవుతున్న ఈ సినిమాకి వీఎఫెక్స్ ఎఫెక్ట్స్ హైలెట్ గా నిలవబోతున్నాయని, ఆ గ్రాఫిక్ వర్క్ కోసమే దాదాపుగా 50 కోట్లు ఖర్చుపెడుతున్నారట. చాలావరకు గ్రీన్ మ్యాట్ లోనే చిత్రీకరణ జరిగిపి వీఎఫెక్స్ లో అన్ని యాడ్ చేస్తారట. హరిహర వీరమల్లు వీఎఫెక్స్ పనులను ఇప్పటికే ఓ కంపెనీకి అప్పగించినట్టుగా తెలుస్తుంది. ఆ వీఎఫెక్స్ వర్క్ లేట్ అవుతున్నందునే క్రిష్ ఈ సినిమాని 2022 సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here