Home News

పల్నాడులో హీటెక్కిన పాలిటిక్స్..కోటప్ప కొండ పై ప్రమాణాలు

పల్నాడు రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. వినుకొండలో కోవిడ్ రోగులకు ఆహర పంపిణీ పై మొదలైన వివాదం గత వారం రోజులుగా పల్నాడు రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు, టీడీపీ నేత జీవీ ఆంజనేయులు మధ్య వార్ నదుస్తుంది. కరోనా రోగులకు కిచిడి, కబాబ్ పెట్టడాన్ని జిల్లా అధికారులు అడ్డుకుంటే తాను అడ్డుకున్నానటం కరెక్ట్ కాదని బ్రహ్మనాయుడు తెలిపారు. జీవీ నిర్వహిస్తున్న శివశక్తి ఫౌండేషన్ సంస్థ దొంగ కంపెనీ అని సంస్థ బ్యాలెన్స్ షీట్లు బయటపెట్టాలని సవాల్ విసిరారు.

కంపెనీ బ్యాలెన్స్ షీట్లతో శివయ్య స్థూపం వద్దకు వస్తానని టీడీపీ నేత జీవీ ఆంజనేయులు ప్రకటించారు. తన పై చేసిన అసత్య ఆరోపణలకు కోటప్ప కొండ పై ప్రమాణం చేసి నిరుపించకున్నా అన్నారు. తనపై చేసిన ఆరోపణలు నిజమైతే ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. తన మీద బురద జల్లటం బొల్లా మానుకోవాలని జీవీ ఆంజనేయులు హెచ్చరించారు. జీవీ ఆంజనేయులు దొంగ ప్రమాణాలు చేస్తున్నారని ..ఎక్కడ నుంచి నిధులు వస్తున్నాయో లెక్కలు చూపకుండా ప్రమాణాలు ఎందుకు చేస్తున్నారని బ్రహ్మనాయుడు విమర్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here