Home Entertainment Cinema

ఎన్టీఆర్ తో వైజయంతీ మూవీస్ భారీ ప్రాజెక్ట్…దర్శకుడు ఎవరో తెలుసా….

మహానటి’, దేవదాస్ చిత్రాలతో భారీ విజయాలు అందుకున్న వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్ మరో భారీ చిత్రానికి ప్లాన్ వేశారు. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ‘అరవింద సమేత’ పూర్తిచేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో రాజమౌళి ప్రస్టేజియస్ మూవీలో నటించనున్నారు. ఇప్పటికే విపరీతమైన హైప్ ని సొంతం చేసుకున్న ఈ మల్టీస్టారర్ వచ్చే ఏడాది పట్టాలెక్కనుంది. దీని తర్వాత అశ్వినీదత్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జూనియర్…

ఈ ఏడాది భారీ విజయాలు అందుకున్న వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్.. మరో భారీ చిత్రానికి ప్లాన్ వేశారు. తమిళ స్టార్ దర్శకుడు అట్లీతో ద్విభాషా చిత్రం చేస్తున్నట్లు ‘దేవదాస్’ మూవీ ప్రమోషన్ ఈవెంట్ లోనే వెల్లడించారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరో అనే వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో సర్క్యులేట్ అవుతుంది. గతంలో ఎన్టీఆర్,అశ్వినీదత్ కాంభినేషన్ లో వచ్చిన ‘శక్తి’ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. దీంతో ఈ భారీ ప్రాజెక్ట్ పట్టలెక్కించి వైజయంతి మూవీస్ నుంచి జూనియర్ కి స్వీట్ గిఫ్ట్ ఇవ్వనున్నారు అశ్వినీదత్.

Theri director Atlee malayalam movie

అట్లి తెరకెక్కించిన సినిమాలు మూడే అయినా ఆయన క్రేజ్ మాత్రం మామూలుగా లేదు. దళపతి విజయ్‌తో వరుసగా రెండు సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు. కిందటేడాది వచ్చిన ‘మెర్సల్’ ఏకంగా 200 కోట్లు వసూలు చేసింది. తమిళనాట ఈ సెన్సేషనల్ దర్శకుడికి విపరీతమైన డిమాండ్ ఉంది. అలాంటి దర్శకుడి కాంభినేషన్ లో అశ్వినీదత్ భారీ ప్రాజెక్ట్ టేకప్ చేయబోతున్నారు.

తెలుగులో ఎన్టీఆర్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు. అయితే అట్లీ వంటి దర్శకుడితో వెళ్తే తమిళంలో కూడా తారక్ మంచి మార్కెట్ ,హైప్ క్రియోట్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు చాలా కాలంగా భారీ చిత్రాలకు దూరంగా ఉన్న వైజయంతీ మూవీస్ కూడా స్పీడు పెంచింది. ఈ ఏడాది రెండు భారీ చిత్రాలను తెరకెక్కించిన ఈ సంస్థ.. ప్రస్తుతం మహేష్‌బాబు ‘మహర్షి’ సినిమా నిర్మాణంలో భాగమైంది. ఇక తర్వాత ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్ పేరు వినిపిస్తుండటంతో వరుస సక్సెస్ లతో మళ్ళీ తన పాత ఫామ్ ని కంటిన్యూ చేస్తున్నారు అశ్వినీదత్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here