Home News Updates

షిర్డీ ఆలయం మూత – తిరుమల వెల వెల

ఆలయాలకు కరోనా ఎఫెక్ట్ తగిలింది … షిర్డీ ఆలయం మూత పడింది .. షిర్డీ చరిత్ర లోనే ఆలయం మూత పడడం ఇది మొదటి సారి . ఆలయ తలుపులను మూసివేయడంతో భక్తులు వెనుదిరుగుతున్నారు .. దైవ యాత్రలు వాయిదా వేసుకుంటున్నారు.

అటు వైరస్ ప్రభావం తిరుమల కొండపై బాగానే పడింది. ఈ వైరస్ భయంతో భక్తుల రాక భారీగా తగ్గింది. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం.. తిరుమల పర్యటనను భక్తులు వాయిదా వేసుకుంటున్నారు. దీంతో భక్తుల రాక రోజురోజుకు భారీగా తగ్గుతోంది. దీంతో స్వామివారి దర్శనం గంట వ్యవధిలోనే అవుతోంది. భక్తులు క్యూలో నిల్చునే పని లేక వెంటవెంటనే దర్శనం అవుతుండడం గమనార్హం.

అంతే కాక భక్తులు సమూహాలుగా కూర్చునే విధానానికి స్వస్తిపలికి మంగళవారం నుంచి టైంస్లాట్ ద్వారా నేరుగా క్యూలో వెళ్లి శ్రీవారిని దర్శించుకునేలా టిటిడి ఏర్పాట్లు చేసింది. సోమవారం అర్ధరాత్రి 12గంటల నుంచి టైంస్లాట్ టోకెన్లు అందించేందుకు వీలుగా తిరుమల తిరుపతిలో కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here