Home Entertainment Now Showing

భీష్మ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్.. నితిన్ ఊచకోత..

నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్లో తెరకెక్కిన సూపర్ ఫన్ ఎంటర్ టైనర్ భీష్మ. సేంద్రియ వ్యవసాయం గురించి వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాడు వెంకీ కుడుముల. ప్రేక్షకులకు కూడా ఈ సినిమా బాగా నచ్చేసింది. శివరాత్రి సందర్భంగా విడుదలైన ఈ సినిమాకు తొలి రోజు ఏకంగా 7.50 కోట్ల షేర్ వచ్చింది. అందులో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 6.30 కోట్ల షేర్ వచ్చింది. నితిన్ కెరీర్లో ఇప్పటి వరకు ఇంత బిగ్గెస్ట్ ఓపెనింగ్ సినిమా ఏదీ లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన అ..ఆ సినిమా తొలి రోజు 5.55 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు భీష్మ రికార్డు తిరగరాసింది. ఈ సినిమా జోరు చూస్తుంటే వీకెండ్ ముగిసేలోపు కచ్చితంగా చాలా ఏరియాల్లో సేఫ్ జోన్ కు వచ్చేలా కనిపిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో 17 కోట్ల బిజినెస్ చేసింది ఈ సినిమా. తొలిరోజు 6 కోట్లకు పైగా రావడంతో డిస్ట్రిబ్యూటర్లు పండగ చేసుకుంటున్నారు. పైగా సినిమాకు పాజిటివ్ టాక్ ఉండటంతో వారు నిశ్చింతగా ఉన్నారు. బాక్సాఫీస్ దగ్గర మరో సినిమా కూడా లేకపోవడం కలిసొచ్చే విషయం. ప్రపంచ వ్యాప్తంగా 21 కోట్ల బిజినెస్ చేసింది భీష్మ. ఖచ్చితంగా తొలివారంలోనే సేఫ్ జోన్ కు రావడమే కాకుండా లాభాల బాట పట్టించేలా కనిపిస్తోంది భీష్మ. ఇక చిత్ర యూనిట్ కూడా ఆడియన్స్ కోసం స్పెషల్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. నైజాంలో తొలి రోజే 2 కోట్లకు పైగా వసూలు చేసింది భీష్మ. అన్ని ఏరియాల్లో అద్భుతమైన ఓపెనింగ్స్ తీసుకొచ్చింది. మొత్తానికి సంక్రాంతి సినిమాల తర్వాత మరో హిట్ లేని తెలుగు ఇండస్ట్రీకి మంచి బ్రేక్ ఇచ్చింది భీష్మ. ఈ సినిమాతో రష్మిక మందన మరో హిట్ అందుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here