Home News Updates

నిర్భయ దోషులకు రేపటి ఉరిపై మూడోసారి స్టే

నిర్భయ కేసులో ఆ నలుగురికి రేపు ఉరి లేదు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు దోషులకు ఉరిపడని న్యాయమూర్తి చెప్పారు. నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్షపై కోర్టు స్టే ఇచ్చింది. త్వరలో ఉరిశిక్ష తేదీని తెలియజేస్తామని కోర్టు తెలిపింది. మూడోసారి వాయిదాపడిన నిర్భయ దోషుల ఉరి శిక్ష.

ఉరిశిక్ష పిటిషన్ పై ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు కాపీ కింద చూడవచ్చు..

నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడింది. వాస్తవానికి రేపు ఉదయం 6 గంటలకు నలుగురు దోషులను ఉరితీయాల్సి ఉంది. ఐతే చివరి నిమిషంలో శిక్ష అమలుపై స్టే విధిస్తూ ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు తీర్పునిచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఉరిశిక్ష అమలు చేయవద్దని అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రానా ఆదేశాలు జారీ చేశారు. నిర్భయ దోషుల ఉరిశిక్ష వాయిదా పడడం ఇది రెండోసారి. ఐతే ఎప్పుడు ఉరితీయాలన్న దానిపై నిర్ణయాన్ని ప్రకటించలేదు కోర్టు. త్వరలోనే కొత్త డెత్ వారెంట్ జారీ చేస్తామని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here