Home News

‘తానా’ అధ్యక్షుడిగా నిరంజన్‌ శృంగవరపు ఎన్నిక

ఉత్తర అమెరికా తెలుగు సంఘం 2021 ఎన్నికల ప్రకియ పూర్తయింది. ఈ ఎన్నికల్లో కర్నూలు జిల్లాకి చెందిన నిరంజన్‌ శృంగవరపు ప్యానెల్ ఘ‌న విజ‌యం సాధించింది. ఆయన తన సమీప ప్రత్యర్ది నరేన్‌ కొడాలి పై 1758 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నిరంజన్‌కు 10,866 ఓట్లు రాగా, నరేన్‌ కొడాలికి 9,108 ఓట్లు వ‌చ్చాయి. శృంగవరపు నిరంజన్‌కు తానా ప్ర‌స్తుత అధ్యక్షుడు జ‌యశేఖ‌ర్‌ తాళ్లూరి, అంజయ్య చౌదరిలు మద్దతు తెలిపారు. నరేన్‌ కొడాలికి మద్దతుగా తానా మాజీ అధ్యక్షుడు జయరాం కోమటి, సతీష్‌ వేమన ప్రచారం చేశారు.

తానాలో గెలుపొందిన వారిలో బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ గా జనార్దన్ నిమ్మలపుడి నాగేంద్ర శ్రీనివాస్ కోడలి న్యూజెర్సీ రీజినల్ కోఆర్డినేటర్‌గా వంశీ వాసిరెడ్డి డల్లాస్ ఫోర్ట్‌వర్త్ రీజినల్ కోఆర్డినేటర్‌గా సతీష్‌ కొమ్మన నార్త్ సెంట్రల్ నుంచి సాయి బొల్లినేని న్యూ ఇంగ్లాండ్ రీజినల్ కోఆర్డినేటర్ గా ప్రదీప్ గడ్డం మిడ్ అట్లాంటిక్ నుంచి సునీల్ కొగంటి మిడ్‌వెస్ట్ నుంచి హనుమాన్ చెరుకూరి న్యూజెర్సీ ప్రాంతీయ సమన్వయకర్త సతీష్ కొమ్మన గెలుపొందారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here