Home Health corona

నేటితో తెలంగాణలో ముగియనున్న రాత్రి కర్ఫ్యూ..కీలక నిర్ణయం తీసుకోనున్న తెలంగాణ సర్కార్


తెలంగాణలో ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న కరోనా కేసులకు అడ్డుకట్ట వేసేందుకు విధించిన నైట్ కర్ఫ్యూను మరికొన్ని రోజులపాటు పొడిగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. నైట్ కర్ఫ్యూ గడువు నేటితో ముగియనుండటంతో మరికొన్ని రోజులు పొడగించేలా నిర్ణయం తీసుకోనుంది కేసీఆర్ సర్కార్. తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసుల పై ఇప్పటికే హై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి మరిన్ని కట్టడి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

మరోవైపు, తెలంగాణలో మరో రెండు మూడు రోజుల్లో లాక్‌డౌన్ విధించబోతున్నారంటూ వస్తున్న వార్తలను ప్రభుత్వం కొట్టివేసింది. అయితే నైట్ కర్ఫ్యూ వేళల పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో వేళల్లో ఏదైన మార్పులు చేసే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ కరోనా నుంచి కోలుకున్న తర్వాత ప్రభుత్వ శాఖల అధికారులతో కరోనా పై సమీక్ష జరుపనున్నారు. పరిస్థితిని బట్టి మరో వారం తరువాత మరిన్ని ఆంక్షలపై సీఎం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here