Home News

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కీలక మలుపు..!

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. రెండు మూడు రోజుల్లో కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకోనున్నట్లు తెలుస్తుంది. గతంలో మున్నాచుట్టు తిరిగిన కేసు ఇప్పడు దస్తగిరి చుట్టు తిరుగుతోంది.. అసలు దస్తగిరికి, మున్నాకు సంబందమేంటీ..సీబీఐ బృందం మాజీ డ్రైవర్ దస్తగిరినే ఎందుకు విచారణ చేస్తున్నారు. అన్నది ఆసక్తి రేపుతుంది.

మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణ కోసం 3 రోజుల క్రితం సీబీఐ అధికారులు కడపకు చేరుకున్నారు. మొదటి రోజు మాజీ డ్రైవర్ దస్తగిరిని ఏడు గంటల పాటు విచారించారు. 2వ రోజు దస్తగిరితో పాటు వివేకా కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లాను విచారించారు. మూడో రోజు కూడా దస్తగిరినే విచారించారు. ఈ క్రమంలోనే జిల్లా ఎస్పీ అన్బురాజన్ ను కూడా సీబీఐ బృందం కలిసినట్లు సమాచారం. గతంలో పాల వ్యాపారి, సెల్ పాయింట్ నిర్వాహకుడు ఇలా రోజుకో కొత్త వ్యక్తి తెరపైకి వచ్చారు… పలు కోణాల్లో దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులు చెప్పుల వ్యాపారి మున్నాను, వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరిని ఎక్కువ సార్లు విచారించడాన్ని బట్టి చూస్తే కేసు వీరి చుట్టే తిరుగుతోందని తెలుస్తుంది.

వైఎస్ వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరిది పులివెందులలోని బాకరాపురం…గతంలో లింగాల మండలం మురారి చింతల గ్రామంలో దస్తగిరి తండ్రి ఎద్దులకు గిట్టలు కొడుతూ జీవనం సాగించేవారు. తర్వాత ఆటో డ్రైవర్ గా, భవన నిర్మాణ పనులకు వెళ్లుతూ జీవించేవారు. కొద్ది రోజులకు పులివెందులకు వలస వచ్చిన దస్తగిరి మాజీ మంత్రి వివేకా కారు డ్రైవర్ గా పని చేశాడు..వివేకా హత్యకు ఐదు నెలల ముందు డ్రైవర్ గా మానేశారు. దీంతో దస్తగిరి ప్రమేయం ఉంటుందన్న కోణంలో పలుమార్లు విచారించారు అధికారులు. దస్తగిరితోపాటు చెప్పుల వ్యాపారి మున్నాను కూడా విచారిస్తున్నారు సీబీఐ అధికారులు.

ఇప్పటికే చెప్పుల వ్యాపారి మున్నా అకౌంట్లను ప్రీజ్ చెయ్యడంతోపాటు లాకర్ లోని 50లక్షల రూపాయలు విలువ చేసే పిక్స్ డ్ డిపాజిట్లు, నగదు, బంగారు అభరణాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఓ కీలక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం కోసం సీబీఐ అధికారులు జిల్లా ఎస్పీ అన్బురాజన్ ను కలిసినట్లు సమాచారం. వివేకా కుమార్తె సునీత ఢిల్లీకి వెళ్లి వచ్చాక కేసు విచారణలో కాస్త దూకుడు పెంచారు సీబీఐ అధికారులు.. ఏది ఏమైనా ప్రస్తుతం సీబీఐ విచారణ మొత్తం దస్తగిరి చుట్టే తిరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here