తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రి ఈటల ఎపిసోడ్ తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ పుట్టించగా పీసీసీ చీఫ్ నియామకంలో కాంగ్రెస్ కూడా స్పీడ్ పెంచింది. ఈటల రాజేందర్ ను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేందుకు రేవంత్,పొన్నం,జీవన్ రెడ్డి ప్రయత్నించగా ఉత్తమ్,కోమటిరెడ్డి లాంటి నేతలు సైలెంట్ అవ్వడంతో ఈటల బీజేపీ దరికి చేరారు. దీంతో చాలా కాలంగా పెండింగులో ఉన్న తెలంగాణ పీసీసీ పదవిని వీలైనంత త్వరగా ప్రకటించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ పీసీసీ రేసులో కోమటికరెడ్డి వెంకట్ రెడ్డి,జీవన్ రెడ్డి,రేవంత్ రెడ్డి,శ్రీధర్ బాబు ఉన్నా ఎంపీ రేవంత్ రెడ్డినే రాహుల్ గాంధీ ఫైనల్ చేశారని సమాచారం. సీఎం కేసీఆర్ ను, బీజేపీ దూకుడును ఎదుర్కొవాలంటే రేవంత్ రెడ్డే సరైన నేత అని హస్తం హైకమాండ్ నిర్ణయించిందని తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ కూడా తుది నివేదిక అందించినట్లు తెలుస్తుంది.