Home Health corona

సెకండ్ వేవ్ కరోనాలో కొత్త లక్షణాలు..ఈ మూడు లక్షణాలుంటే బీ అలర్ట్

కరోనా రూటు మార్చింది. మానవ శరీరంలోని ప్రతీ అవయవంపైనా దాడి చేస్తోంది. మరో మూడు కొత్త లక్షణాలు కూడా కరోనాకు సంబంధించినవేనని నిపుణులు తేల్చారు. ఏ అనారోగ్య సమస్య వచ్చినా నిర్లక్ష్యం చేయొద్దని సూచిస్తున్నారు. కళ్లు ఎర్రబడటం, చెవుల్లో రింగింగ్‌ సౌండ్ రావడం, గ్యాస్ట్రిక్‌ సమస్యలు రావడం కూడా కరోనా లక్షణాలేనని గుర్తించారు నిపుణులు.

గతేడాది తొలి దశలో జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు, వాసన కోల్పోవడం, రుచిని కోల్పోవడం, శ్వాస సంబంధమైన సమస్యలను కరోనా లక్షణాలుగా గుర్తించారు. ప్రస్తుతం విస్తరిస్తున్న రెండో దశలో వీటితో పాటు మరో మూడు కొత్త లక్షణాలను కూడా పరిశోధకులు ఈ జాబితాలోకి చేర్చారు. కళ్లు గులాబీ రంగులోకి మారడం, వినికిడి సమస్యలు, జీర్ణాశయ సంబంధ సమస్యలు కూడా కరోనా లక్షణాలుగానే పరిగణనలోకి తీసుకోవాలని చెబుతున్నారు.

కళ్లు గులాబీ రంగులోకి మారడం కూడా కరోనా లక్షణమేనని చైనాలో జరిగిన ఓ అధ్యయనం ద్వారా బయటపడింది. కళ్ల కలక, కళ్ల వాపు, కంటి నుంచి అదే పనిగా నీరు కారడం.. మొదలైన వాటిని కూడా కరోనా లక్షణాలుగానే గుర్తించాలని ఆ అధ్యయనం తెలిపింది. చైనాలో రెండో దశలో ప్రతి 12 మందిలో ఒకరు కంటి సంబంధ సమస్యలతో బాధపడ్డారు. చెవిలో అదే పనిగా రింగింగ్ సౌండ్ వినిపించడం, వినికిడి సమస్యలు తలెత్తడం కూడా కరోనా లక్షణాలేనని మరో అధ్యయనం ధ్రువీకరించింది. డయేరియా, వాంతులు, కడుపు నొప్పి, వికారం కూడా కరోనా లక్షణాలే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here