Home Health corona

దడ పుట్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్..సర్వేలో సంచలన విషయాలు

దేశంలో కరోనా విజృభిస్తోంది. సెకండ్ వేవ్‌లో భాగంగా క‌నిపిస్తున్న కొత్త వేరియంట్ గ‌త వేరియంట్‌తో పోలిస్తే రెండు నుంచి రెండున్న‌ర రెట్లు వేగంగా వ్యాపిస్తున్న‌ట్లు తేలింది. వైరస్‌ ఇదేరీతిన మార్పులకు గురవుతూ పోతే మూడో విడత కరోనా కల్లోలం కూడా రావొచ్చని హెచ్చరించారు వైద్య నిపుణులు. దేశంలో కరోనా రెండో దశ విలయం సృష్టిస్తోంది. ప్రతిరోజు 3 లక్షలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. సెకండ్‌ వేవ్‌ వైరస్‌ మొదటి దశ కంటే రెండు నుంచి రెండున్నర రెట్లు అధిక ప్రభావవంతమైనదని పరిశోధనల్లో వెల్లడైంది. ఒకరి నుంచి ఒకేసారి ముగ్గురికి వైరస్‌ వ్యాపిస్తుందని తేలింది..

ముంబయిలో కరోనా మరణాలు అధికంగా నమోదవడానికి కారణాలను పరిశోధిస్తున్నామని సర్వే తెలిపింది. మహారాష్ట్రలో రెండో దశ వైరస్‌ ఫిబ్రవరి నెలలోనే వ్యాప్తి చెందిందని.. లోకల్‌ రైళ్లను తిరిగి ప్రారంభించడంతో అది విజృంభించిందని పేర్కొంది. మే మొదటి వారంలో ముంబయిలో మరణాలు అధికంగా ఉంటాయని, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విజయవంతంగా కొనసాగితే జూన్‌ 1 నాటికి మరణాల సంఖ్య తగ్గుతుందని సర్వే తెలిపింది..

కోవిడ్-19 వైరస్‌ ఇలాగే మార్పులకు గురవుతూ పోతే భారత్‌లో మూడో విడత కరోనా కల్లోలం కూడా రావచ్చని హెచ్చరించారు ఎయిమ్స్‌ డైరక్టర్‌ రణదీప్ గులేరియా. అయితే టీకాలు చాలామందికి చేరగలిగితే దీని ప్రభావం అంతగా ఉండకపోవచ్చని చెప్పారు. తగిన గడువుతో లాక్ డౌన్ విధిస్తే వైరస్‌ను కట్టడి చేయొచ్చని తెలిపారు. కనీసం రెండు వారాలు లాక్‌డౌన్ కటినంగా అమలు చేయాలని సూచించారు రణదీప్‌ గులేరియా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here