Home News

తమిళనాడు ఎన్నికల్లో ఠాగుర్ కి ఫండింగ్..టీ కాంగ్రెస్ లో చిచ్చురేపుతున్న ఫిర్యాదులు

తెలంగాణ ఇంఛార్జి ఠాగూర్ మీద కూడా రాహుల్ గాంధీకి ఫిర్యాదుల పరంపర కొనసాగుతుంది. మాణిక్కం ఠాగూర్ తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా వచ్చిన కొత్తలో దూకుడుగా వ్యవహరించారు. పిసిసి నియామక ప్రక్రియలో ఠాగూర్ చుట్టూ కొంత నీలినీడలు కమ్ముకున్నాయ్. పార్టీలో ఓ సీనియర్‌ నేత తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో రాను రాను పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు తమిళనాడు ఎన్నికల్లో ఠాగూర్ కి ఫండింగ్ చేశారట కొందరు టీ కాంగ్రెస్ నేతలు ఇప్పుడిదే గాంధీభవన్ లో రచ్చ రేపుతుంది.

దుబ్బాక అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌గా బాధ్యతలు తీసుకున్నారు మాణిక్కం ఠాగూర్‌. పీసీసీ నియామకం విషయంలో ఠాగూర్ రేవంత్ కి మద్దతిస్తున్నారని ఢిల్లీకి లేఖలు సైతం వెళ్లాయ్. తర్వాత కాంగ్రెస్‌ సీనియర్ నేత జానారెడ్డి లాంటి నాయకులు… పిసిసి నియామకాన్ని కొన్ని రోజులు వాయిదా వేయాలని కోరారు. దీంతో ఆ ప్రక్రియ కాస్తా ఆగిపోయింది. ఇప్పుడు ఎన్నికలు కూడా ముగిశాయి. ఈలోపు ఠాగూర్ మరో వివాదంలో చిక్కుకున్నారు.

ఇంఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్ మామ తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఎన్నికల్లో ఓడిపోయారు. సొంత మామ కోసం టికెట్… గెలుపు కోసం ఎంతో చెమటోడ్చి నిలబడ్డారు. అయితే ఈ వ్యవహరంపై తెలంగాణ కాంగ్రెస్‌లోని ఓ వర్గం నేతలు ఢిల్లీ పెద్దలకు లేఖ రాశారట. మామ ఎన్నికల కోసం తెలంగాణ నుంచి భారీగా ఫండింగ్ జరిగిందని లేఖలో పేర్కొన్నారట. రాహుల్ గాంధీకి ఒకరిద్దరు నాయకులు ఫిర్యాదు కూడా చేశారట.

ఇంఛార్జ్‌కు తెలంగాణ నేతలు ఎన్నికల ఫండ్ చేయాల్సిన అవసరం ఏంటి అనే అంశాలను లేవనెత్తినట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా పేరున్న ఠాగూర్ మీద ఆరోపణలు ఎటు దారి తీస్తాయో వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here