Home News Updates

కాంగ్రెస్ లో భగ్గుమన్న అసమ్మతి..సీఎం పై సిద్ద్దూ ఫైర్

పంజాబ్ లో సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్దూ మధ్య వివాదం మళ్లీ ముదిరింది. తాజాగా సీఎం అమరీందర్ సింగ్‌పై సిద్దూ తీవ్రస్థాయిలో మండిపడ్దారు. తాను పార్టీ మారుతున్నట్లు సీఎం వర్గియులు దుష్ప్రచారం చేస్తున్నారని దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేశారు. సిద్దూ కాంగ్రెస్‌లో ఉంటూ క్రమశిక్షణా రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని, ఆయన ఆప్‌లో చేరుతున్నట్లు తెలుస్తోందని సీఎం అమరీందర్ సింగ్ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యల పై సిద్దూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. నేను ఇతర పార్టీ నేతలతో చర్చలు జరిపినట్లు నిరూపిస్తారా ఈ తేదీ వరకూ నేనెవర్నీ ఏ పదవీ అడగలేదు. చాలా మంది ఆహ్వానించి, కేబినెట్ బెర్త్ ఇస్తామని హామీ ఇచ్చారు. అయినా నేను ముట్టలేదు. నేను కోరుకునేది పంజాబ్ అభివృద్ది మాత్రమే అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో హైకమాండ్ జోక్యం చేసుకోవాల్సిందే అని ట్విట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here