Home Entertainment Cinema

నాని కోసం ఎంతమంది వచ్చారు.. నాచురల్ స్టార్ అందరివాడు..

అదేంటి అందరివాడు అంటే చిరంజీవి కదా.. మరి నానికి ఈ ట్యాగ్ లైన్ ఇచ్చేస్తున్నారేంటి అనుకుంటున్నారా. ఇప్పుడు నిజంగానే ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే హిట్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరిగిన తీరు చూసి ఇండస్ట్రీలో నానికి ఉన్న ఫాలోయింగ్ ఏంటి అనేది మరోసారి ప్రూవ్ అయింది. టాలీవుడ్ నెంబర్ వన్ దర్శకుడు రాజమౌళి నుంచి నిన్న మొన్న ఇండస్ట్రీకి వచ్చిన తరుణ్ భాస్కర్ వరకు ఈ వేడుకకు అందరూ వచ్చారు. కేవలం నాని పిలిచాడని ఆయనపై ఉన్న అభిమానంతో ఈ వేడుకకు చాలామంది గెస్ట్లుగా వచ్చారు. ఈ మధ్యకాలంలో ఒక సినిమా ఈవెంట్ లో ఇంతమంది హీరోలు కానీ దర్శకులు కానీ నిర్మాతలు కానీ రావడం ఎప్పుడూ చూడలేదు. వచ్చిన వాళ్ళందరూ స్టేజ్ ఎక్కి మాట్లాడేసరికి దాదాపు మూడు నుంచి నాలుగు గంటలు పట్టింది అంటే ఎంత మంది అతిథులు వచ్చారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Natural Star Nani

ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ కు ఉన్న డిమాండ్ అలాంటిది. ఆయన పిలిస్తే రాను అని చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. పైగా నిర్మాతగా మారి చేసిన సినిమా కావడంతో ప్రమోషన్ కార్యక్రమాలు దగ్గరుండి చూసుకుంటున్నాడు నాని. హిట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాజమౌళి, అనుష్క, రానా, రాఘవేంద్రరావు, దిల్ రాజు చీఫ్ గెస్ట్ లుగా వచ్చారు. వాళ్లతో పాటు నాని స్నేహితులు అల్లరి నరేష్, సందీప్ కిషన్, నవదీప్, సునీల్, కార్తికేయ, తరుణ్ భాస్కర్, కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్దగా ఉంది. ఒక సినిమా ఈవెంట్ లో ఇంత మంది స్టార్స్ రావడంతో అక్కడికి వచ్చిన అభిమానులు కూడా పండగ చేసుకున్నారు. ఏదేమైనా కూడా ఒక హీరోపై ఇంత అభిమానం ఉండటం కూడా మంచి విషయమే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి నటుడిగా సక్సెస్ కావడమే కాకుండా స్టార్ గా ఎదిగి ఇప్పుడు నిర్మాతగా మారి మంచి సినిమాలు నిర్మిస్తున్నాడు నాని. హిట్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొడతానని చెబుతున్నాడు ఈయన. మరి ఈ నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here