Home Health corona

గుడ్ న్యూస్: కెనడా నాసల్ స్ప్రే తో ఇక కరోనా పరార్

కెనడాలోని వాంకోవర్‌కు చెందిన బయోటెక్‌ కంపెనీ సెనోటైజ్‌ ఈ నైట్రిక్‌ ఆక్సైడ్‌ నాసల్‌ స్ప్రే ను రూపొందించింది. ఈ స్ప్రేను రోగులే సొంతంగా తమ ముక్కులో స్ప్రే చేసుకోవచ్చు. ఇది ముక్కులో ఉన్న వైరల్‌ లోడ్‌ను తగ్గిస్తుంది. దీంతో వైరస్‌ ముక్కులోనే అంతమైపోయి ఊపిరితిత్తుల వరకు వెళ్లే ఆస్కారం ఉండదు. కెనడా, బ్రిటన్‌లో దీని ట్రయల్స్‌ జరిగాయి. కరోనా బారిన పడిన 79 మందిపై నిర్వహించిన రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో.. 24 గంటల్లో 95% వైరస్‌ లోడ్‌ తగ్గినట్టు వెల్లడైంది. 79 గంటల్లో 99% వరకు వైరస్‌ లోడ్‌ తగ్గిపోయినట్టు తేలింది. బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వైరస్‌పై కూడా ఇది ప్రభావవంతంగా పనిచేసినట్టు తేలింది.

కెనడాలో రెండోదశ ట్రయల్స్‌లో 103 మంది పాజిటివ్‌ వ్యక్తుల ముక్కులో స్ప్రే చేయగా, అందరికీ నెగెటివ్‌ వచ్చింది. బ్రిటన్‌లో ఎన్‌హెచ్‌ఎస్‌ నిర్వహించిన రెండోదశ ట్రయల్స్‌లో 70మంది రోగులు పాల్గొన్నారు. వారితో పోల్చితే ట్రయల్స్‌ నిర్వహించని వారి ముక్కులో 16 రెట్లు అధికంగా వైరస్‌లోడ్‌ ఉన్నట్టు తేలింది. కెనడాలో ఏడువేల మందిలో ట్రయల్స్‌ నిర్వహించగా ఎవరికీ చెప్పుకోదగిన సైడ్‌ఎఫెక్ట్స్‌ రాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here