నాసా సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. కదలకుండా పడుకుంటే 11 లక్షలిస్తానంటూ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అవునండీ ఇది నిజం. ఏ ట్విస్టు లేకుండా ఉత్త పుణ్యానికి అంత భారీ మొత్తం ఎలా చెల్లిస్తారు ఊరుకొండి మీరు మీ కామెడి అనకండి ఇది నిజం దీని కోసం నాసా రిక్రూట్ మెంట్ కూడా స్టార్ట్ చేసింది…
నాసా చేస్తున్న ఈ విన్నూత రిక్రూట్మెంట్ ఎందుకంటే… ఒక మనిషి అంతరిక్షంలో ఉంటే తన బరువు పై ప్రయోగం చేసేందుకు అంటుంది నాసా. ‘బెడ్‌రెస్ట్ స్టడీ’ పేరుతో ఇప్పటికే అభ్యర్థులను రిక్రూట్ చేసుకుంటుంది. మరి ఇదేంటీ అలా పడుకుంటేనే 11 లక్షలు ఇస్తారా అని డౌట్ వస్తుందా మరి పడుకోవడమంటే ఒకరోజు రెండు రోజులు కాదు ఏకంగా 70 రోజులు పడుకోవాలి. ఏంటి చిన్న సైజు బిగ్‌బాస్ షో గుర్తుకొస్తోందా.. మరి అంత డబ్బు ఇస్తున్నప్పుడు ఈ కొంచెం పని చేయక తప్పదు.
ఇందుకు ఒక సెటప్ ఏర్పాటు చేసిది నాసా. ఇక ఇక్కడ జాబ్ ఏమిటంటే నిద్రపోవడమే.. అంటే పడుకొనే తినాలి, పడుకొనే స్నానాలు చేయాలి. కదలకుండా జస్ట్ పడుకోవాలంతే…అప్పుడు మనిషి శరీరంలో అవయవాల పనితీరు హెల్త్ కండీషన్ ను అంచనా వేస్తుంది అంతరిక్ష పరిశోధనలు చేసే నాసా సంస్థ. హాయిగా నిద్రపోయే ఉద్యోగం ఇచ్చి చక్కగా శాలరీ ఇస్తామంటే ఎవరు మాత్రం కాదంటారు.