జూనియర్ ఎన్టీఆర్ రక్తికట్టించిన తెలుగు బిగ్‌బాస్‌ని న్యాచురల్ స్టార్ చేతిలో పెట్టారు. ప్రొమోలతో ఊదరగొట్టేస్తున్నాడు నాని. మొదటి సీజన్‌ని ఇంట్రస్టింగ్‌గా మలిచి పార్టిసిపెంట్స్‌కి బోలెడంత పాపులారిటీ తెచ్చిపెట్టి బిగ్‌బాస్ సీజన్ 2లో ప్రేక్షకులను రంజింపజేయబోతున్న స్టార్స్ ఎవరనేది ప్రోగ్రాం స్టార్టయ్యాకే తెలియబోతోంది. ఈలోపు ఫలానా ఫలానా ఈ షోలో ఉండబోతోందన్న ప్రచారమైతే జోరందుకుంది.
ఈ కింది వారు బిగ్‌బాస్2లో ఉండొచ్చని చెబుతున్నారు. ఉండే వారి జాబితా పై ఊహాగానాలు ఇవే:
గీతామాధురి
బాబు గోగినేని
అమిత్ తివారి
దీప్తి వాజపేయి
తనిష్
భాను
రాప్ సింగర్ రోల్ రిదా
షామల
కిరీటి దామరాజు
కౌశల్
డబ్ స్మాష్ ఫేం దీప్తి సునైనా
తేజస్వి
సామ్రాట్
గణేష్ (కామన్ మ్యాన్)
సంజన (కామన్ మ్యాన్)
నూతన్ నాయుడు (కామన్ మ్యాన్)
మిగతావాళ్ల సంగతేమోగానీ ఈ మధ్య ఫిల్మ్‌ఛాంబర్ ముందు బట్టలిప్పేసిన సెన్సేషనల్ స్టార్ శ్రీరెడ్డి కూడా బిగ్‌బాస్‌లో ప్రత్యక్షమయ్యేందుకు మాగ్జిమమ్ ప్రయత్నాలు చేసిందన్న వార్త హల్చల్ చేస్తోంది. అయితే కొరివితో తలగోక్కోడం ఎందుకని ఆమెని వద్దనుకున్నారని సమాచారం. పైగా బిగ్‌బాస్ హోస్ట్ నానిని కూడా శ్రీరెడ్డి ఇదివరకే బద్నాం చేసింది. నాని కొంప కొల్లేరు చేసే సీక్రెట్లు బయటపెడతానని భయపెట్టింది. దీంతో ఏరికోరి ఆమెను తీసుకునే ఛాన్స్ లేనట్లే. రేప్పొద్దున బిగ్‌బాస్‌ని కూడా రోడ్డుమీదికి ఈడుస్తుందనే భయంతోనే ఆమె పేరు పక్కనపెట్టారని చెబుతున్నారు.