Home Entertainment Cinema

రాక్షసుడు వచ్చేసాడు.. విలన్‌గా నాని ఫస్ట్ లుక్..

నాని అంటే ఇప్పటి వరకు రాముడు మంచి బాలుడు తరహా పాత్రలే చేస్తూ వచ్చాడు. జెంటిల్ మెన్ సినిమాలో కాస్త నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర చేసినా కూడా చివరికి అది మళ్లీ పాజిటివ్ అయిపోయింది. అయితే ఇప్పుడు మాత్రం ఈయన పూర్తి స్థాయి విలన్ అయిపోయాడు. ఇప్పటి వరకు ఈయన కెరీర్ లో చేసిన పాత్రలు ఒకెత్తు అయితే ఇప్పుడు చేయబోయేది ఒకెత్తు. అది కూడా నాని 25వ సినిమా. అదే వి.. టైటిల్ విచిత్రంగా ఉంది కదా. అందులో రాక్షసుడుగా నటిస్తున్నాడు నాని.

Nani as Villain in Sudhir Babu Rakshasudu

మళ్లీ క్లైమాక్సులో మారిపోవడాలు.. మంచోడు అయిపోవడాలు ఇందులో ఉండవు. మొత్తానికి రాక్షసుడు అంతే. ఈ సినిమాలో నాని విలన్.. సుధీర్ బాబు హీరో. ఈయన పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుంటే.. నాని విలన్ గా చేస్తున్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకుడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా మార్చ్ 25న విడుదల కానుంది. గ్యాంగ్ లీడర్ ఫ్లాప్ తర్వాత నాని కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో పడిపోయాడు. ఈ సినిమా కచ్చితంగా నాని ఆశలు తీర్చేలా కనిపిస్తుంది. పైగా ఇంద్రగంటితో నానికి ఇది మూడో సినిమా. పైగా ఆయన కెరీర్ కు లైఫ్ ఇచ్చిన గురువుతోనే ఇప్పుడు సినిమా చేస్తున్నాడు నేచురల్ స్టార్. ఈ చిత్రంలో నివేదా థామస్ హీరోయిన్ గా నటిస్తుంది.

తాజాగా విడుదలైన నాని లుక్ కూడా సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ముఖ్యంగా నాని విలన్ అనేసరికి ఆసక్తి కూడా పెరిగిపోతుంది. హాలీవుడ్ రేంజ్ లో ఇందులో యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయని.. కచ్చితంగా ఈ చిత్రంతో ఇంద్రగంటి రేంజ్ కూడా పెరుగుతుందని చెబుతున్నారు నిర్మాత దిల్ రాజు. దాంతో పాటు దిల్ రాజుతో కూడా ఇది నానికి హ్యాట్రిక్ సినిమా. ఇప్పటికే ఈ కాంబినేషన్ లో వచ్చిన నేను లోకల్, ఎంసిఎ సినిమాలు సంచలన విజయం సాధించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here