Home News Politics

ఆ ఎంపీ టిక్కెట్ కోసం గులాబీ పార్టీలో‌ ఫుల్‌ డిమాండ్…!

పార్లమెంట్ ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతుండటంతో నల్గోండ ఎంపీ టిక్కెట్  కోసం గులాబీ పార్టీ నేతలు ప్రయత్నాలు  ముమ్మరం చేశారు. దీంతో నల్గొండ టీఆర్ఎస్ ఎంపీ టికెట్ కు ఫుల్ డిమాండ్ ఉంది. నల్గొండ టీఆర్ఎస్ ఎంపీ టిక్కెట్ తనకే ఇవ్వాలంటూ గులాబీ నేతలు  ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జిల్లాలో‌ నేతలతో పాటు‌ పక్క జిల్లా ఎంపీ కూడా ఈ సీటు‌మీద‌ కన్నేయడంతో నల్గొండ‌ టిక్కెట్‌  పై మరింత‌ ఆసక్తి‌ పెరిగింది. అసలు
నల్గొండ టీఆర్ఎస్ ఎంపీ రేసులో ఉన్న నేతలు ఎవరు..?

పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఇప్పటికే లోక్ సభ అభ్యర్థుల ఎంపిక పై సీఎం కేసీఆర్ ప్రతేకమైన దృష్టి పెట్టారు. ఇప్పటికే  నిర్వహించిన సర్వే ఫలితాల ఆధారం గా గులాబీ బాస్ ఎంపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలుస్తుంది.  ఇక్కడ ప్రస్తుతం ఎంపీగా గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.సుఖేందర్ రెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించి ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. మంత్రి పదవిని ఇస్తామని సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ హామీ ఇచ్చినందునే ఆయన పార్టీ మారారని అప్పట్లో  ప్రచారం సాగింది.సుఖేందర్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా నియమించారు. ఆ పోస్టుకు కేబినెట్ హోదాను కల్పించారు. అయితే ఈసారి సుఖేందర్ రెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది .నల్గొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ గుత్తా …ఈ సారి ఎంపీగా మళ్లీ పోటీ చేయబోనని, ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రి పదవి ఇస్తే చాలన్నట్లు ఉన్నారు.. దీంతో గుత్తా నల్గొండ ఎంపీ గా పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదట..

ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా దేశంలో ఫెడరల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలని  భావిస్తున్న కేసీఆర్ నల్గొండ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది.  కేసీఆర్ పోటీ చెయ్యక పోతే నల్గొండ టీఆర్ఎస్ ఎంపీ గా పోటీ చేసేందుకు నేతలనుంచి తీవ్ర పోటీ ఉంది… వారిలో నల్గొండ ఎంపీ గా పోటీ చేసేందుకు అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి , టీఆరెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా కిషన్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి,  తెరా చిన్నప రెడ్డి, చందర్ రావ్, ఎన్నారై జలగం సుదీర్  ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఎన్నారై జలగం సుదీర్ తనకు నల్గొండ ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని కేసీఆర్ కు , కేటీఆర్ కు లేఖలు రాశారు. హుజూర్ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన శానంపూడి సైది రెడ్డి కూడా ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట…

ఇక ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటికి టిక్కెట్ ఇవ్వద్దంటూ ఖమ్మం జిల్లాలో ఓడిన నేతల వరుస కంప్లైట్లతో ఆయన టిక్కెట్ హోల్డ్ లో పెట్టింది గులాబీ పార్టీ. ఖమ్మం నుంచి కొత్త‌అభ్యర్ధి తెర‌మీదుకు రావడంతో కనీసం నల్గొండ సీటు‌అయిన ఇవ్వమంటు పొంగులేటి అడుగుతున్నట్లు‌తెలుస్తుంది. ఇలా రోజుకో‌ నేత పేరు తెర‌ మీదకు రావడంతో నల్గొండ టిక్కెట్ ఎవరికి దక్కుతుందా‌ అన్న టెన్శన్ మొదలైంది ఆశావహుల్లో. నల్గొండ కి‌ చెందిన మరో పారిశ్రామిక వేత్త పేరు కూడా టిక్కెట్‌రేసులో‌ బలంగా‌‌ వినిపిస్తుంది.

నల్గొండ పార్లమెంట్ స్థానంలో నల్గొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, దేవర కొండ, కోదాడ, హుజూర్ నగర్, సూర్య పేట మొత్తం 7 నియోజకవర్గ లు ఉన్నాయి…. కాంగ్రెస్ కు కంచు కోట గా ఉన్న నల్గొండ జిల్లా 2014 అసెంబ్లీ ఎన్నికల తరువాత నల్గొండ పార్లమెంట్ స్థానంలో ఒక్క హుజూర్ నగర్ మినహా మిగిలిన ఆరు అసెంబ్లీ  స్థానాలను  టీఆరెస్ పార్టీ కైవసం చేసుకుంది..దీంతో నల్గొండ నుంచి టీఆర్ఎస్ ఎంపీ గా గెలవడం తెలికని భావించిన నేతలు టిక్కెట్ తమకంటే తమకు కేటాయించాలని కేసీఆర్ , కేటీఆర్ ను వేడుకుంటున్నారు.

నల్గొండ ఎం.పి గా గుత్తా కాంగ్రెస్ నుంచి గత ఎన్నికల్లో గెలవడంతో పాటు కాంగ్రెస్ ఉద్దండులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి   నల్గొండ ఎంపీ స్థానంలో వున్నారు. వీరికి బలమైన క్యాడర్ ఉంది.నల్గొండ కాంగ్రెస్  ఎంపీ టిక్కెట్ కోసం కాంగ్రెస్ సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ పద్మావతి, పటేల్ రమేష్ రెడ్డి, రాం రెడ్డి దామోదర్ రెడ్డి  పోటీపడుతున్నారు.దింతో పాటు నల్లగొండ లో కాంగ్రెస్ కు బలమైన క్యాడర్ ఉండటంతో  నల్గొండ టీఆరెస్ ఎంపీ గా బలమైన నేతను టీఆరెస్  ఎంపీ అభ్యర్థి గా బరిలోకి దించాలని గులాబీ బాస్ చుస్తున్నారట…. చూడాలమరి నల్గొండ టీఆరెస్ ఎంపీ టిక్కెట్ ఎవరికి దక్కనుందో…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here