Home News Stories

కారు స్పీడ్ కి కాంగ్రెస్ పట్టు నిలుపుకుంటుందా…!

పోరాటాల ఖిల్లా , కాంగ్రెస్ ఉద్దండులు ఉన్న జిల్లా నల్లగొండ.. ఒక్కప్పుడు కమ్యూనిస్టులకు , ఆతర్వాత కాంగ్రెస్ కు కంచుకోట అయిన నల్గొండ జిల్లాలో మరోసారి వరుస విజయం కోసం కాంగ్రెస్, మొట్ట మొదటి సారి జెండా ఎగురవేసేందుకు టీఆర్ఎస్ తహతహలాడుతుంటే ..పట్టు నిలుపుకునేందుకు బీజేపీ, కమ్యూనిస్టులు ప్రచారం ముమ్మరం చేశాయి.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీ బరిలో నిలవడం , ఇదే స్థానం పై సీఎం కేసీఆర్ ప్రతేకమైన దృష్టి పెట్టడం తో నల్గొండ ఎంపీ స్థానం ఇప్పుడు హాట్ సీట్ గా మారింది..

దేశ చరిత్రలోనే నల్గొండ పార్లమెంట్ స్థానానికి ప్రతేకమైన స్థానం ఉంది. నల్గొండ పార్లమెంట్ స్థానానికి 16 సార్లు ఎన్నికలు జరగ్గా…అందులో 6 సార్లు సీపీఐ అభ్యర్థులు గెలవగా, 6 సార్లు కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలిచారు, రెండుసార్లు టీడీపీ అభ్యర్థులు గెలిచారు. ఒకసారి సీపీఎం అభ్యర్థి, ఒకసారి తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థి గెలుపొందారు. ఇప్పటి వరకు బీజేపీ , టీఆర్ఎస్ ఒక్కసారి కూడా ఇక్కడి నుంచి గెలవలేదు… అయితే ఈసారి గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఊపుతో ఇక్కడ టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతోంది. నల్గొండ జిల్లాలో మొదట నల్గొండ , మిర్యాలగూడ పార్లమెంట్ స్థానాలు వుండేవి. పునర్వ్యవస్థీకరణ లో భాగంగా 2009లో మిర్యాలగూడ రద్దై భువన గిరి పార్లమెంట్ ఏర్పడింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రస్తుతం నల్గొండ, భువన గిరి రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి.

నల్గొండ సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి.మొత్తం 3 సార్లు నల్గొండ ఎంపీ గా గెలిచి రికార్డ్ సృషించారు. గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ నుంచి 1999 లో టీడీపీ నుంచి ఒకసారి ఆతరువాత 2009,2014 లో కాంగ్రెస్ నుంచి రెండు సార్లు ఎంపీ గా గెలిచారు.. 2014 లో కాంగ్రెస్ నుంచి ఎంపీ గా గెలిచి గుత్తా టీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తుండటం తో కొత్త అభ్యర్ది వేమి రెడ్డి నర్సింహ రెడ్డి ని నల్గొండ ఎంపీ బరిలో నిలిపారు సీఎం కేసీఆర్…కొత్త అభ్యర్ది బరిలో ఉన్న సీఎం కేసీఆర్ బరిలో ఉన్నట్లే బావించాల్సిన పరిస్థితి.. నల్గొండ ఖిల్లా మీద గులాబీ జెండా ఎగుర వేయడానికి కేసీఆర్ ప్రతేక దృష్టి పెట్టారు..నల్గొండ పార్లమెంట్ స్థానంలో గెలిచేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం తో ఇక్కడ పోటీ ఆసక్తి కరంగా మారింది..

నల్గొండ పార్లమెంట్ పరిధిలో నల్లగొండ, దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట, మొత్తం 7 శాసనసభ స్థానాలు ఉన్నాయ్.. ఇందులో హుజూర్ నగర్ మినహా మిగిలిన అన్ని స్థానాలు టీఆర్ఎస్ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కైవసం చేసుకుంది. నల్గొండ పార్లమెంట్ స్థానంపై టీఆర్ఎస్ జెండా ఎగురవేయడమే లక్ష్యం గా కేసీఆర్ ప్రచారానికి పదును పెట్టారు. వేమి రెడ్డి నర్సింహ రెడ్డి రాజకీయా అనుభవం తక్కువ.. రాజధాని బ్యాంక్ చైర్మన్ గా వున్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం చెల్మాడ కు చెందిన ఆయన .. అర్బన్ బ్యాంక్ చైర్మన్ వున్నారు…నల్గొండ పార్లమెంట్ పరిధి లో రెడ్డి సామాజిక ఓట్లు కీలకం….దింతో నల్గొండ లో వేమి రెడ్డి నర్సింహారెడ్డి గురించి సర్వే చేయించి కేసీఆర్ టిక్కెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది..

ఇక మరోసారి నల్గొండ పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకునెందుకు ఎంపీ గా టిపీసీసీ చీఫ్ ఉత్తమ్ ను రాహుల్ గాంధీ ప్రకటించారు.ఈసారి నల్గొండ నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్ పోటీ చేయటం సీఎం కేసీఆర్ ప్రత్యెక మైన దృష్టి పెట్టి మొట్ట మొదటి సారి నల్గొండ ఎంపీ సీటు గులాబీ పార్టీ కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తుండటం తో ఇక్కడ గెలుపు ఎవరిదనే ఉత్కంఠ మారింది… ఉత్తమ్‌, జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్‌, రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతి, ఉద్ధండుల సెగ్మెంట్లున్న ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపు ఇప్పుడు కాంగ్రెస్ కు అగ్ని పరీక్ష లా మారింది. ఇక్కడి విజయం రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశాలు పుష్కలంగా ఉండడంతో ఇరు పార్టీలు నువ్వా-నేనా అన్నట్లు పోరాటానికి సిద్ధపడుతున్నాయి.

తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన తొలి పార్లమెంట్ ఎన్నికల్లో సైతం టీఆర్‌ఎస్‌ మూడో స్థానానికే పరిమితం అయ్యింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కాంగ్రెస్‌ తన విజయంపై చాలా ఆశలు పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్‌ ఎన్నికల పరిస్థితి వేర్వేరుగా ఉంటుందని, దేశ రాజకీయాలు, ప్రధాని ఎవరు కావాలనే అంశాన్ని బట్టే ఓటింగ్‌ ఉంటుందని కాంగ్రెస్‌ నాయకులు చెపుతున్నారు. దీంతో ఆ పార్టీ నేతల్లో నల్లగొండ ఎంపీ స్థానంలో గెలుస్తామన్న ధీమా గా వ్యక్తం చేస్తున్నారు..రాజకీయ అనుభవం ఉన్న ఉత్తమ్ మొట్ట మొదటి సారి గా ఎంపీ గా పోటీ చేస్తున్నారు..వేమి రెడ్డి నర్సింహ రెడ్డి రాజకీయలకు కోతవ్యక్తి … 1987 లో స్థానిక సంస్థలు ఎన్నికల్లో పోటీ చేసి ఓడి పోయి రాజకీయాలకు దూరంగా ఉన్నారు..

నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోట. ఏడు సెగ్మెంట్లలోనూ బలమైన నేతలున్నారు. జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి , పద్మావతి, అసెంబ్లీ సెగ్మెంట్లు దీని పరిధిలోనే ఉన్నాయి. కానీ, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వారంతా ఓటమి పాలయ్యారు. కోదాడలో ఉత్తమ్‌ సతీమణి పద్మావతి కొద్ది ఓట్ల తేడాతోనే ఓడారు. దాంతో, తమ తమ సెగ్మెంట్లలో ఈసారి గెలుపు వారికి ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈసారి ఎలాగైనా గెలవాలనే కసితో ఉన్నారు. ఇది ఉత్తమ్‌కు కలిసొచ్చే అంశం. కానీ, ఇక్కడి ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఉండడంతో పోటీ ఆయనకు కత్తి మీద సామే. ఎమ్మెల్యేలు లేకపోయినా తమ ఓటు బ్యాంకు పటిష్ఠంగానే ఉందని, టీఆర్‌ఎస్ పై వ్యతిరేకత ఉత్తమ్‌ గెలుపునకు కారణమవుతుందని కాంగ్రెస్‌ భావిస్తోంది.

వాయిస్..మొత్తం గా నల్గొండ పార్లమెంట్ పరిదిలో ఏ పార్టీ కి ఓటర్లు పట్టం కట్టనున్నారు.. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచి జెండా ఎగుర వేయనుంది అనేది ఆసక్తి గా మారింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here