Home Entertainment Reviews

అశ్వథ్థామ ఎలా ఉన్నాడంటే.. నాగ శౌర్య సినిమా ట్విట్టర్ రివ్యూ.. Ashwathama Review

కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు అశ్వథ్థామ. నాగ శౌర్య హీరోగా రమణ తేజ తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలైంది. ప్రీమియర్ షోస్ కూడా పడిపోయాయి. ఓవర్సీస్ టాక్ ప్రకారం చూస్తుంటే అశ్వథ్థామ సినిమాతో శౌర్య పెట్టుకున్న నమ్మకం నిలబడేలా కనిపించడం లేదు. మరోసారి రొటీన్ కథతోనే వచ్చాడు ఈ కుర్ర హీరో. ఛలో తర్వాత హిట్ లేని శౌర్య.. తనే సొంతంగా కథ రాసుకుని మరి అశ్వథ్థామ సినిమా చేసాడు.

ఈ చిత్రంతో కచ్చితంగా మాస్ ఇమేజ్ అందుకుంటానని కొన్ని రోజులుగా ప్రతీ ఇంటర్వ్యూలోనూ చెబుతూనే ఉన్నాడు. పైగా సమాజంలో జరిగే అంశాలే ఈ చిత్రంలో చూపించామని చెప్పాడు ఈ కుర్ర హీరో. చిన్నప్పటి నుంచి తనకు కథలు రాయడం అంటే ఇష్టమని.. తన కలకు ప్రతిరూపం అశ్వథ్థామ అంటూ ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చాడు ఈ కుర్ర హీరో. అయితే ఇప్పుడు విడుదలైన తర్వాత చూస్తుంటే మాత్రం అశ్వథ్థామకు అంత టాక్ రావడం లేదు. ముఖ్యంగా రొటీన్ స్క్రీన్ ప్లే సినిమాకు మైనస్ అయిందంటున్నారు ఆడియన్స్. సినిమాలో కథ బాగానే ఉన్నా కూడా దాన్ని తెరకెక్కించిన విధానం ఆకట్టుకోలేదని చెబుతున్నారు వాళ్లు. శౌర్య తన వరకు అద్భుతంగా నటించాడని..

ఇప్పటి వరకు ఏ సినిమాలో కనిపించనంత మాస్ గా ఇందులో ఉన్నాడని చెబుతున్నారు ఓవర్సీస్ ప్రేక్షకులు. పైగా కథ కూడా అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాల నేపథ్యంలోనే సాగుతుంది. విలన్ కారెక్టరైజేషన్ కూడా బాగానే ఉంది. ఇంటర్వెల్ వరకు కూడా సినిమా మంచి ఊపుతో సాగినా కూడా ఆ తర్వాత మాత్రం ఉసూరుమనిపించిందని చెబుతున్నారు ప్రేక్షకులు. స్క్రీన్ ప్లేపై ఇంకాస్త ఫోకస్ చేసుంటే కచ్చితంగా అశ్వథ్థామ నాగశౌర్య కెరీర్ లో బెస్ట్ సినిమా అయ్యుండేదని.. కానీ అలా చేయలేదని చెబుతున్నారు వాళ్లు. మెహ్రీన్ పెద్దగా ఇంపార్టెన్స్ లేని పాత్రలోనే కనిపించింది. మొత్తానికి చూడాలిక.. అశ్వథ్థామ సినిమాతో శౌర్య ఎలాంటి ఫలితాన్ని చూడబోతున్నాడో మరి..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here