Home Entertainment Cinema

నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ

మన్మథుడు 2 సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని నాగార్జున నటిస్తున్న సినిమా ‘వైల్డ్ డాగ్‌’. యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో నాగార్జునకు హీరోయిన్ ఎవరూ లేరు. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇఛ్చారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్నారు.

నాగార్జున వైల్డ్ డాగ్

నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలు. అహిషోర్ సాల్మోన్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. కొత్త దర్శకులను నమ్మి విజయం సాధించడంలో నాగార్జున ఎక్స్ పర్ట్. ఇప్పుడు కూడా ఇదే చేయాలనుకుంటున్నాడు ఈ సీనియర్ హీరో. పైగా మన్మథుడు 2 సినిమా తీసుకొచ్చిన చెడ్డపేరు.. విమర్శలు వైల్డ్ డాగ్ తొలగిస్తుందని నమ్ముతున్నాడు ఈయన. ఈ సినిమాలో ఒక కీలక పాత్రను బాలీవుడ్ పాపులర్ తార దియా మీర్జాను తీసుకున్నారు దర్శక నిర్మాతలు. సినిమాలో ఆమెది పర్ఫార్మెన్సుకు బాగా ప్రాధ్యాన్యం ఉన్న పాత్రని తెలుస్తుంది. కథను మలుపు తిప్పే ఈ పాత్రకు ఆమె అయితే న్యాయం చేస్తుందన్న నమ్మకంతో దియాను తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతోంది. అతి త్వరలోనే దియా మీర్జా పాల్గొనే సన్నివేశాలు మొదలు కానున్నాయి.

దియా మీర్జా

ఈ మధ్యే విడుదల చేసిన వైల్డ్ డాగ్ ఫ‌స్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇందులో అసిస్టెంట్ క‌మీష‌న‌ర్ ఆఫ్ పోలీస్ విజ‌య్ వ‌ర్మను నటిస్తున్నాడు నాగార్జున. ఈయన్ని డిపార్ట్ మెంట్ లో అంతా ‘వైల్డ్ డాగ్’ అని పిలుస్తుంటారు. అందుకే సినిమాకు కూడా అదే టైటిల్ పెట్టేసారు. కొన్ని యదార్థ సంఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ కథ రాసుకున్నాడు సోలోమెన్. త్వరలోనే సినిమా విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here