తెలంగాణలో ప్రధాన రాజకీయపక్షాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కౌటింగ్ లో టీఆర్ఎస్ దూసుకుపోతుంది. నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్‌లో అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. తొమ్మిదో రౌండ్ ముగిసే సమయానికి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ 7,936 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. బీజేపీ అభ్యర్థి రవికుమార్‌కు కి కేవలం 2,585 ఓట్లు వచ్చాయి. ఇంకా 15 రౌండ్ల ఫలితాలు రావల్సి ఉంది. ఫలితాల ట్రెండ్ చూస్తే టీఆర్ఎస్ కి 20 వేల వరకు అధిక్యం వచ్చేల కనపడుతుంది.

ఇక తిరుపతి ఉప ఎన్నికల కౌంటింగ్‌లో వైసీపీ భారీ ఆధిక్యతతో దూసుకెళ్తోంది. తిరుపతి ఉపఎన్నికలో ఆరవ రౌండ్ పూర్తి అయ్యే సరికి వైసీపీ అభ్యర్థి ముద్దిళ్ల గురుమూర్తి ముందుజలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి 1,47,5161ఓట్లు, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీకి 85,210 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 2191ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి 64,991 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఫలితాల ట్రెండ్ చూస్తుంటే వైసీపీ మెజార్టీ 4 లక్షలకు పైగా సాధించేలా ఉంది. ఇక బీజేపీ,జనసేన ఉమ్మడి అభ్యర్ది డిపాజిట్ సాధించడం కష్టంగానే ఉంది.