నాగార్జున ఇప్పటికే బోల్డన్ని రోల్స్‌తో బిజీగా ఉన్నాడు. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే, మరోవైపు అన్నపూర్ణ స్టూడియోస్‌లో సినిమాలు నిర్మిస్తున్నాడు. అలాగే బిగ్‌బాస్ లాంటి టీవీ షోస్‌కి హోస్టింగ్ కూడా చేస్తున్నాడు. ఇన్ని పనులతో బిజీగా ఉన్న నాగార్జున త్వరలోనే ఒక ఓటీటీ ప్లాట్ ఫామ్ స్టార్ట్ చేస్తాడనే ప్రచారం జరుగుతోంది.

మహేశ్ బాబు ‘బిజినెస్మెన్’ టైటిల్‌తో సినిమా చేశాడు గానీ, ఈ టైటిల్ నాగార్జునకి సరిగ్గా సరిపోతుందని టాలీవుడ్లో ఓ టాక్ ఉంది. ప్రాఫిట్స్‌ని కాలిక్యులేట్ చెయ్యడంలో నాగార్జున అంత కరెక్ట్‌గా ఉంటాడని సినీజనాలంతా చెప్తుంటారు. ఇప్పుడీ బిజినెస్మెన్ అలాగే కొత్తగా ఓటీటీ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నాడని టాలీవుడ్ లో చర్చ నడుస్తుంది.
కరోనా ఫస్ట్ వేవ్‌తో థియేటర్ బిజినెస్ పడిపోతే, ఓటీటీ మార్కెట్ పెరిగిపోయింది. అందుకే నాగార్జున కూడా ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేస్తే బెటర్ అనుకుంటున్నాడట. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన సినిమాలతో పాటు, అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో చదువుతోన్న విధ్యార్థులకి ఈ ఓటీటీని ఒక ప్లాట్‌ఫామ్‌గా మార్చాలనే ఆలోచనలో ఉన్నాడట.
సినిమాల విషయానికి వస్తే నాగార్జున ఇప్పుడు ప్రవీణ్ సత్తారుతో ఒక సినిమా చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాగార్జున రా ఏజెంట్‌గా కనిపిస్తాడని చెప్తున్నారు. అలాగే కళ్యాణ్ క్రిష్ణ డైరెక్షన్లో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సీక్వెల్ చెయ్యబోతున్నాడట నాగ్.