Home Entertainment Cinema

బంగార్రాజు వచ్చేస్తున్నాడు.. కాకపోతే కాస్త ఆలస్యంగా..

నాగార్జున కెరీర్ లో సోగ్గాడే చిన్నినాయనా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రంతో చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్ట్రర్ అందుకున్నాడు ఈయన. అది కూడా పండగ సీజన్ లో కుమ్మేసాడు. నాగ్ కెరీర్ లో సోలోగా 50 కోట్ల మార్క్ అందుకున్న సినిమా ఇదే. సోగ్గాడే తర్వాత మళ్లీ విజయం కోసం చూస్తున్నాడు నాగార్జున. మూడేళ్లుగా ఈయన కెరీర్ లో పెద్ద విజయం అంటూ లేదు. ఇలాంటి సమయంలో మళ్లీ ఇదే సినిమాను.. అదే దర్శకుడిని నమ్ముకుంటున్నాడు ఈయన. సోగ్గాడే సీక్వెల్ బంగార్రాజు సినిమా గురించి అందరికీ తెలుసు.

ఈ చిత్రం చేయాలని రెండేళ్లుగా చూస్తున్నాడు నాగ్. అయితే సమయం దొరకడం లేదంతే. ఇన్నేళ్లకు ఈ టైమ్ వచ్చేసింది. బంగార్రాజు త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్నాడు. ఈ చిత్రం మార్చ్ 3వ వారం నుంచి పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు సీనియర్ హీరో. అన్నపూర్ణ స్టూడియోస్ పైనే బంగార్రాజు సినిమాను నిర్మించబోతున్నాడు నాగార్జున. ఇప్పటికే కళ్యాణ్ కృష్ణ కథ కూడా సిద్ధం చేసాడు. ఇక నాగ చైతన్య, అనుష్క కీలక పాత్రల్లో నటించబోతున్నారు. డిసెంబర్ విడుదలకు సినిమాను ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి చూడాలిక.. బంగార్రాజుతో నాగ్ ఎలాంటి మాయ చేస్తాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here