Home News Politics

ఆ జంట పక్షుల వారసులకు సీటు దక్కెనా?

వారిద్దరు ప్రాణ స్నేహితులు ,అయితే చివరి కాలంలో కొంత రాజకీయంగా వారి మధ్య విభేదాలు నడిచాయి. అయితే ఇప్పుడు ఓ స్నేహితుడు మరణించగా మరో స్నేహితుడు అయితే వయోబారంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇద్దరి వారసులు తమ తండ్రుల వారసత్వాన్ని నిలబెట్టడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ నియోజకవర్గాల నుంచి టిక్కెట్ సంపాదించి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. కాని పార్టీలో వీరికి పోటీగా మరో వర్గం టిక్కెట్ ప్రయత్నాల్లో ఉండటంతో ఈ వారసుల టిక్కెట్ల పై టెన్షన్ మొదలైంది….

చిత్తూరు జిల్లా రాజకీయాలలో జంటపక్షులు అంటే గుర్తుకు వచ్చేది స్వర్గీయ గాలి ముద్దు కృష్ణమ నాయుడు,బొజ్జల గోపాల క్రిష్ణారెడ్డి. ఇద్దరు ఎస్వీ యూనివర్సిటిలో క్లాస్మేట్స్, తర్వాత వారు వేరు వేరు రంగాల్లో స్థిరపడ్డా స్నేహితులుగా ఉన్నారు. టిడిపి అవిర్బావంతో రాజకీయాల్లోకి వచ్చిన గాలిముద్దు కృష్ణమ నాయుడు ముందుగా రాజకీయాలలోకి వచ్చి మంత్రి అయ్యారు. తర్వాత అయన ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చిన బొజ్జల కూడా మంత్రి అయ్యారు. ఇద్దరు కేవలం ఒక సారి మాత్రమే ఓటమి పాలయ్యారు. ఈవిదంగా వీరి రాజకీయ ప్రస్తానం నడిచింది. పార్టీ ప్రతిపక్షంలో వున్నప్పుడు సైతం జంటకవుల్లాగా తిరిగారు. ఇద్దరిది ఓకేమాట ,ఓకే బాట లాగా నడిచారు.అయితే 2014ఎన్నికల్లో గాలి ఓటమి తర్వాత జరిగిన పరిణామాలతో స్నేహం విడిపోయింది. మంత్రిగా ఉన్న బొజ్జల వర్గం గాలికి ఎమ్మెల్సీ రాకుండా అడ్డుకుందని బయటకు రావడంతో వీరి స్నేహం విడిపోయింది. ఆ తర్వాత బొజ్జల అనారోగ్యంతో మంత్రి పదవికి దూరం అయ్యారు. ఇదే సమయంలో గాలి ముద్దు కృష్ణమ నాయుడు కూడా గత సంవత్సరం మరణించారు.

ఇక బొజ్జల అనారోగ్యం కారణంగా అయన కూమారుడు సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి టికెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. గాలితో ఎంత సన్నిహితుడో సీఎం చంద్రబాబుకు బొజ్జల అంతే సన్నిహితుడు. ఈస్నేహంతో సీఎం ను బొజ్జల పలుమార్లు తన కూమారుడు సుదీర్ టికెట్ ఇమ్మని కోరినట్లు సమాచారం. అయితే ఇక్కడ బలమైన నాయకుడు అయిన మజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు రూపంలో బొజ్జల ప్రయత్నాలకు విఘాతం కలుగుతుంది. ఎస్సీవి నాయుడు ప్రభావం కాళహస్తి ,సత్యవేడు.వెంకటగిరి నియోజకవర్గాలలో వుండటంతో టిడిపి అదిష్టానం నాయుడిని ఎలా సమన్వయం చేయాలన్న దానిపి మకతికలు పడుతుంది. దీనికితోడు ఓ వైపు స్నేహితుడు మరో వైపు పార్టీ భవిష్యత్ అన్నట్లు చంద్రబాబు ఇబ్బంది పడుతున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. దీంతో బోజ్జలనే మరోసారి పోటీ చేయమని సీఎం కోరినట్లు తెలుస్తుంది. అయితే తన అరోగ్యం సహకరించదని సీఎంకు బొజ్జల చెప్పినట్లు తెలుస్తొంది.

నగరిలో కూడా విచిత్ర రాజకీయం నడుస్తోంది. గాలి కుటుంబానికి టికెట్ ఇస్తానని సీఎం చెప్పినప్పటికి గాలి కుటుంబంలోని విభేదాలతో పాటు నియోజకవర్గంలోని అంతర్గత రాజకీయం వల్ల గాలి కుటుంబానికి చెక్ పెట్టాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గాలి కూమారుడు గాలి భాను ప్రకాష్ కు టికెట్ ఖరారు అయిందనే వార్తలు వస్తున్న నేపద్యంలో ఇప్పడు విద్యాసంస్థల అదినేత అశోక్ రాజు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. గాలి కుటుంబంలో వారసుల విభేదాలతో ఆయన తర్వాత ఎమ్మెల్సీ పదవికి ఆయన భార్య సరస్వతి ఎంపికయ్యారు. తర్వాత పరిణామాలలో నగరి నియోజక వర్గంలో గాలి కుటుంబాన్ని రాజకీయాలకు దూరం చేయడానికి టిడిపిలోని ఓవర్గం వారసుల మధ్య విభేదాలకు అగ్నికి ఆజ్యంలా వాడుకుంది. అయితే గాలి కుటుంబానికి టికెట్ రాక పోతే అయన అనుచర వర్గంగా ఉన్న జీడీ నెల్లూరు,చంద్రగిరి ,సత్యవేడు,మదనపల్లి,తిరుపతి నియోజకవర్గాల్లో అనుచర వర్గం ఉండటంతో అయా ప్రాంతాలలో వీరి కుటుంబానికి ప్రభావం ఉండటంతో గాలి భాను ప్రకాష్ కు టికెట్ ఖరారు అవుతుందనే ప్రచారం ఉపందుకుంది.

వీరితో పాటు సీనియర్ నాయకురాలు కుతుహాలమ్మ తన కూమారుడు డాక్టర్ హారికృష్ణకు జిడీ నెల్లూరు ఇన్ చార్జీగా అవకాశం ఇప్పించింది. అయితే అక్కడ ఇప్పుడు తల్లి కొడుకుల మద్య విభేదాలు మొదలు కావడంతో కుతుహాలమ్మ తిరిగి తనకే అవకాశం ఇమ్మని కోరినట్లు సమాచారం. అయితే ఇది వైసీపీకి బలమైన నియోజకవర్గం కావడంతో మరో కొత్త వ్యక్తికి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉందని అంటున్నారు. నోటిఫికేషన్ రేపు మాపో వస్తుందనే సమయంలో కీలక నియోజకవర్గాలు అయిన కాళహస్తి,నగరిలో సీనియర్ నాయకులు ,ప్రాణ స్నేహితుల కుమారులు అయిన బొజ్జల సుదీర్,గాలి బాను ప్రకాష్ లు ఎన్నికల బరిలో వుంటారా లేదా అన్నది రెండు మూడు రోజుల్లో తెలిపోనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here