Home Entertainment Cinema

సమంతతో మరోసారి రొమాన్స్ చేయబోతున్న నాగచైతన్య.

భార్యాభర్తలు మరోసారి రొమాన్స్ చేయబోతున్నారు. అక్కినేని నాగ చైతన్య-సమంత అక్కినేని జోడీకి ఇప్పుడు ఇండస్ట్రీలో మామూలు క్రేజ్ లేదు. వాళ్ల కోసమే కథలు రాస్తున్నారు దర్శకులు. ముఖ్యంగా మజిలీ బ్లాక్ బస్టర్ కావడంతో వాళ్ల కోసమే ప్రత్యేకంగా స్క్రిప్ట్స్ సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇదే జరగబోతుంది. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది. నాగార్జునతో సోగ్గాడే చిన్ని నాయన లాంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన కళ్యాణ్ కృష్ణ ప్రస్తుతం ఈ చిత్ర సీక్వెల్ ‘బంగార్రాజు’తో బిజీగా ఉన్నాడు. ఇందులో నాగచైతన్య కూడా నటిస్తున్నాడు. ముందు సినిమా మాదిరే నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుంటే.. నాగ చైతన్యకు జోడీగా సమంత నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కథ నచ్చడంతో వెంటనే స్యామ్ కూడా ఓకే చెప్పినట్లుగా ప్రచారం జరుగుతుంది. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్ర కథ ఇప్పుడు ఫైనల్ అయింది.

నేల టిక్కెట్టు ఫ్లాప్ తర్వాత ఇదే కథపై కూర్చున్నాడు కళ్యాణ్. ఇప్పటికి స్క్రిప్ట్ ఫైనల్ కావడంతో ఖుషీగా ఉన్నారు నాగార్జున, నాగచైతన్య. ఈ సినిమాతో పాటు మరో కొత్త దర్శకుడు చెప్పిన కథ కూడా సమంత చైతన్యకు నచ్చిందని తెలుస్తోంది పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేస్తే సినిమా చేయడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని వాళ్ళు చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి మరోవైపు బంగార్రాజు సినిమా పనులు కూడా జరుగుతున్నాయి. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు ఈ చిత్రానికి. ఇందులో నాగార్జున, నాగచైతన్య తండ్రి కొడుకులుగా నటిస్తున్నారని.. షూటింగ్ త్వరలో మొదలు కానుందని తెలుస్తుంది. 2021లో సినిమా విడుదల కానుంది. మరి చూడాలిక.. చైతూ సమంత జోడీ 5వ సారి స్క్రీన్ పై ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here