Home Entertainment Cinema

అఖిల్ కి స్పాట్ పెట్టిన నాగ చైతన్య..

అక్కినేని ఫ్యామిలీలో ఇప్ప‌టి వర‌కు రికార్డులు తిర‌గ‌రాసే స్టార్ హీరోలు ఎవ్వ‌రూ రాలేదు. అంతా సాఫ్ట్ గా వెళ్లిపోయే వాళ్ళే. కానీ అఖిల్ ను చూసిన త‌ర్వాత ఆ లోటు తీరిపోతుంద‌ని అంతా అనుకున్నారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు అఖిల్ కూడా ఆ స్థాయిలో మెరిపించ‌లేదు. ఈయ‌న చేసిన తొలి సినిమా అఖిల్ డిజాస్ట‌ర్ గా నిలిచింది. దాంతో అఖిల్ స‌త్తా ఏంటో ఇంకా పూర్తి స్థాయిలో బ‌య‌టికి రాలేదు. అయితే అఖిల్ ఫ్లాపైనా.. ద‌ర్శ‌కులు మొత్తం ఈ సిసింద్రీ కోస‌మే ఎగ‌బ‌డ‌తారేమో అనుకున్నారంతా. కానీ అలాంటివేం జ‌ర‌గ‌ట్లేదు. అఖిల్ కంటే అంద‌రూ నాగ‌చైత‌న్య‌పైనే దృష్టి పెడుతుండ‌టం ఇక్క‌డ విచిత్రం.

Naga Chaitanya and Akhil

నిదాన‌మే ప్ర‌ధానం త‌ర‌హాలో నాగ‌చైత‌న్య ఒక్కో సినిమా చేస్తూ వెళ్తున్నాడు. చైతూకి ఇమేజ్ స‌మ‌స్య లేదు. ఎలాంటి క‌థ‌లోకైనా ఈజీగా వెళ్లిపోతాడు. కానీ అఖిల్ విష‌యంలో అలా కాదు. ఇమేజ్ అడ్డొస్తుంది. తొలి సినిమాతోనే మాస్ హీరో కావాల‌ని ట్రై చేసి బోల్తా కొట్టాడు ఈ హీరో. అయితే ఈయ‌న్ని క్లాస్ గా చూడ‌టం కంటే మాస్ గా చూడ్డానికి ప్రేక్ష‌కులు ఇష్ట‌ప‌డుతున్నారు. దాంతో వెరైటీ క‌థ‌లన్నీ చైతూ ద‌గ్గ‌రికే వెళ్తున్నాయి. పైగా ద‌ర్శ‌కులంద‌రూ అక్కినేని కంపౌండ్ కి వెళ్లి త‌మ‌కు చైతూనే కావాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు.

నాగ‌చైత‌న్య కెరీర్ ప్ర‌స్తుతం సూప‌ర్ స్పీడ్ లో వెళ్తోంది. ఈయ‌న కోసం ముగ్గురు న‌లుగురు ద‌ర్శ‌కుల‌ను లైన్ లో ఉంచాడు. ఇప్ప‌టికే సోగ్గాడే చిన్నినాయ‌నా ఫేమ్ క‌ళ్యాణ్ కృష్ణతో చైతూ బంగార్రాజు సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమాతో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇలా మొత్తానికి త‌న జోరుతో త‌మ్ముడి స్పీడ్ కు బ్రేకులు వేస్తున్నాడు అక్కినేని పెద్ద కుమారుడు. అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో బిజీగా ఉన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here