Home Health corona

ఏపీలో దడ పుట్టిస్తున్న N440K కరోనా వేరియంట్‌..శ్వాస సమస్యలకు కారణం ఇదే

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. కేసులు అనూహ్యంగా పెరగడానికి N440K వేరియంట్‌ కారణమంటున్నారు నిపుణులు. తెలుగు రాష్ట్రాల్లోని కరోనా శాంపిల్స్ పరీక్షించిన హైదరాబాద్‌లో సెంటర్‌ ఫర్‌ మాలిక్యులర్‌ బయాలజీ -సీసీఎంబీ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని నిర్ధారించారు. ప్రస్తుతం విశాఖపట్నంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కరోనా వ్యాప్తికి N440K లేదా ఏపీ వేరియంటే కారణమని అంచనా వేస్తున్నారు.

ఏపీ వేరియంట్‌ను తొలి సారిగా కర్నూలు జిల్లాలో గుర్తించారు. ప్రస్తుతం తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లో 20 శాతానికి పైగా ఇన్ఫెక్షన్లు ఏపీ వేరియంట్‌ వల్ల సంక్రమించినవే అంటున్నారు నిపుణులు. ఢిల్లీలో కరోనా రీఇన్ఫెక్షన్‌కు కూడా N440K రకమే కారణమంటున్నారు నిపుణులు. ఈ రకం కరోనా వైరస్‌… ఊపిరితిత్తుల కణాలకు బలంగా అతుక్కుపోతోంది. ఏపీ వేరియంట్‌గా పిలుస్తున్న N440K సాధారణ కరోనా వైరస్‌ కంటే 15 రెట్లు శక్తివంతమైనది. ఇండియన్‌ వేరియంట్స్‌ B1-617, B1-618ల కంటే కూడా ఈ వైరస్‌ చాలా వేగంగా విస్తరిస్తోంది. గతంలో గుర్తించిన B1-36కి ఇది దగ్గరగా ఉంది.

విచిత్రమైన విషయం ఏమిటంటే… ఏపీ వేరియంట్‌ లేదా N440K క్రమేమీ అంతమవుతుండగా, దాని స్థానంలో మరో రెండు వేరియంట్లు వేగంగా విస్తరిస్తున్నాయి. B1-1-77 వేరియంట్‌తో పాటు B1-617 వేరియంట్లు దాదాపు అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయి. వీటిని డబుల్‌ మ్యూటెంట్‌ ఇండియన్‌ వేరియంట్స్‌గా పిలుస్తున్నారు. మార్చి, ఏప్రిల్‌లో తెలంగాణలో ఇండియన్‌ వేరియంట్స్‌ వల్ల ఇన్ఫెక్షన్లు బాగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ మొదట్లో మూడో వంతు కేసుల్లో ఎన్‌440కే రకం వైరస్‌ బయటపడగా… ప్రస్తుతం డబుల్‌ మ్యుటెంట్‌ వ్యాపిస్తోందని అంచనా వేస్తున్నారు నిపుణులు. కర్ణాటక, కేరళలో ఎన్‌440కే రకం వైరస్‌ దాదాపు కనుమరుగయ్యే దశలో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here