Home Entertainment Cinema

కరోనా టైంలో వైరల్ అవుతున్న ‘మై విలేజ్ షో అనిల్ వెడ్డింగ్ కార్డ్’

కరోనా సమయంలో పెళ్లి కార్డులు కూడా వినూత్నంగా డిజైన్ చేస్తున్నారు. పెళ్లి పత్రికలో కనిపించే శ్రీరస్తు.. శుభమస్తు బదులు శానిటైజర్ ఫస్టు.. మాస్క్ మస్టు.. సోషల్ డిస్టెన్స్ బెస్ట్ అంటు క్యాప్షన్ ఇచ్చారు. ఇక కరోనా సమయంలో పెళ్లి కాబట్టి స్వయంగా రావడం కంటే ఆన్ లైన్ లో పెళ్లి చూడటం బెస్ట్ అంటు ఇంటర్నెట్ లో పెళ్లి చూసి ఆశీర్వదించాలంటూ రూపోందించారు. ఇక పెళ్లి చూడాలంటే వన్ జీబీ డేటా ఉంచుకుని పిల్ల,జెల్ల,ముసలోల్లు ‘మై విలేజ్ షో’ లో పెళ్లీ చూడలంటు వినూత్నంగా సెలవిచ్చారు. మై విలేజ్ షో వీడియోస్ ద్వారా ఫేమస్ అయిన అనిల్ పెళ్లి మే1 న జరుగనుండటంతో వెడ్డింగ్ కార్డ్ ఇలా డిజైన్ చేశారు.

వధూవరుల హోదా,చదువుకి బదులు కరోనా నెగిటివ్‌ అంటు సరికొత్త క్యాప్షన్ ఇచ్చారు. లైవ్‌లో తల్వాలు పడ్డంక ఎవ్వరింట్ల ఆళ్లు బువ్వ తినుర్రి. బరాత్‌ ఉంది కానీ ఎవరింట్ల వాళ్లు పాటలు పెట్టుకొని ఎగురుర్రి. మీరు ఎగిరిన15 సెకన్ల వీడియో మాకు పంపుర్రి..దాన్ని మా చానల్ లో పెడతాం అంటూ తాపీగా పెళ్లి కార్డులో సెలవిచ్చారు.ఇక కట్నాలు, కానుకలు గూగుల్‌ పే లేదా ఫోన్‌ పే ద్వారా క్యూఆర్‌ స్కాన్‌ చేసి పంపండి’ అంటూ రూపొందించిన ఈ ఫన్నీ వెడ్డింగ్‌ కార్డ్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంది. కట్న, కానుకలను కరోనా కాలంలో తిండి లేకుండా బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం అందించబడుతుందని వెడ్డింగ్ కార్డులో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here