బిగ్ బాస్ ఫేమ్ హరితేజ సోషల్ మీడియాలో షాకింగ్ విషయాలు బయటపెట్టింది. ఇటీవల పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన హరితేజ సరిగ్గా డెలివరీ సమయంలో కరోనా సోకడం వల్ల పడిన ఇబ్బందుల్ని తెలియజేసింది. తనతో పాటు తన కుటుంబం మొత్తం కరోనా బారినపడి ఎలా బయటపడింది తెలిపింది. తన బేబీని ఎలా కాపాడుకుందో చెప్తూ ఉద్వేగానికి గురైంది హరితేజ.
తొమ్మిదోనెల ప్రెగ్నెన్సీలో ఉన్న సమయంలో జరిగిన షాకింగ్ విషయాలు బయట పెట్టింది హరి తేజ. సరిగ్గా డెలివరీకి వారం ముందు చెకప్‌కి వెళ్లినప్పుడు అంతా బాగుంది.. నార్మల్ డెలివరీ అవుతుందని డాక్టర్ చెప్పారు. కరెక్ట్‌గా వారంలో డెలివరీ అనగా ఎలా జరిగిందో ఎవరి ద్వారా జరిగిందో తెలియదు కానీ.. మా ఇంట్లో అందరికీ కోవిడ్ పాజిటివ్ వచ్చింది. నేను కూడా టెస్ట్ చేయించుకుంటే నాకు కూడా పాజిటివ్ వచ్చింది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నానన్నది పక్కనపెడితే.. మనకి రాదులే.. వచ్చినప్పుడు చూసుకుందాం అని ఉంటుంది చాలా మందికి. అలాంటిది నాక్కూడా జరిగిందేమో.. నేను జాగ్రత్తగా లేనేమో అని ఆ క్షణంలో అనిపించింది.
నాకు పాప పుట్టిందని చాలామంది విషెష్ అందించారు.. అందరికీ థాంక్స్. అయితే అందరికీ రిప్లై ఇచ్చే పరిస్థితిలో అప్పుడు నేను లేను. అందుకే ఇప్పుడు చెప్తున్నాను. ఈ విషయాలు మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. ఒక్కొక్కరు ఫోన్ చేసి కొన్ని కొన్ని ఇన్స్‌డెంట్స్ చెప్తూ ఉంటే.. నేను కూడా కొన్ని చెప్పాలని అనిపిస్తుంది. ఎందుకంటే నాకు జరిగింది చెప్తే కొంతమంది అయినా మారతారేమో ఆలోచిస్తారేమో అని ఈ వీడియో చేస్తున్నా అని తెలిపింది.