దేశంలో ఓ వైపు కరోనా వైరస్ విజృంభిస్తుంటే.. మనదేశంలో రాజకీయ నాయకులు అవలంభిస్తోన్న తీరు, కార్పోరేట్ హాస్పిటల్స్ దోపీడిపై సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, నటుడు ఆర్పీ పట్నాయక్ తీవ్ర ఆవేదన చెందారు. కంటతడి పెడుతూ ఆవేదనకు గురయ్యారు. ఒకప్పుడు మనం వుహాన్‌ను చూసినట్టు.. ప్రస్తుతం ప్రపంచం మన దేశాన్ని చూస్తోందంటూ పాలకుల పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
పైకి కనిపిస్తున్న కరోనా లెక్కలన్నీ అబద్దాలేనని అసలైన లెక్కలు శశ్మానాలలో కనిపిస్తున్నాయన్నారు. ఎలక్షన్లు ఇతర వ్యాపకాల పై పెట్టిన దృష్టి ప్రజల పై పెడితే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ధౌర్భాగ్యపు రాజకీయ నాయకుల వల్లే మనదేశం ఈ దుర్భర స్థితిని ఎదుర్కొంటుంది అన్నారు. ఎన్నికల మీద మీరు పెట్టిన శ్రద, దృష్టిలో కనీసం ఒక్క శాతమైన ప్రస్తుతం ఉన్న పరిస్థితి మీద పెట్టండన్నారు.