Home News Stories

కోళ్లు పెంచాలనుకుంటున్న ధోనీ

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటారు సెలబ్రిటీలు. సిన్మావాళ్లయినా, క్రికెట్ స్టార్లయినా తమ కెరీర్ పదేళ్లుంటేనే గొప్పని చాలామందికి తెలుసు. అందుకే వాట్ నెక్ట్స్ అనేదానిమీద ఎప్పుడూ ముందుచూపుతోనే ఉంటారు. టీమిండియా కెప్టెన్ బాధ్యతలనుంచి ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ టీం లీడింగ్ దాకా సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ఆడాడు జార్ఖండ్ డైనమైట్ మహేంద్రసింగ్ ధోనీ. అంతర్జాతీయ క్రికెట్.కి ఇప్పటికే గుడ్.బై చెప్పేసిన ధోనీ…వచ్చే ఏడాది ఐపీఎల్.తో పూర్తిగా బ్యాట్ పక్కనపడేసే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే ఫ్యూచర్ ప్లాన్స్ రెడీ చేసుకున్నాడు ఎంఎస్ ధోనీ. భార్యతో కలిసి వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడు. పోయినేడాది మోడ్రన్ రైతుగా మారిపోయి రాంచీలోని తన ఫాంహౌస్,లో ఆర్గానిక్ ఫామింగ్ కూడా మొదలుపెట్టేశాడు. నా పొలంలో కూడా మొలకలు వచ్చాయని సంబరపడినట్లు…స్వయంగా పొలం దున్ని పుచ్చకాయలు పండించా

వికెట్ల వెనుక కనురెప్ప వేయకుండా కాపు కాసే ధోనీకి ఓ బిజినెస్ వెనుక ఏముందో బాగా తెలుసు. అందుకే కొత్త వ్యాపారినకి ప్లాన్ చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్. కోళ్లు పెంచబోతున్నాడు. వార్నీ…ఇదేంటీ…ఇంత బతుకూ బతికి చివరికి కోళ్ల ఫాం పెట్టబోతున్నాడా! అనుకునేరు. సాదాసీదా కోళ్ల ఫాం కాదది. కడక్.నాథ్ కోళ్లు. అత్యధిక పోషక విలువలతో..రైతులకు బాగానే గిట్టుబాటవుతున్న కడక్.నాథ్ కోళ్లను పెంచబోతున్నాడు ధోనీ. రాంచీలోని తన ఫాంహౌస్.లో భారీగా ఆర్గానిక్ పౌల్ట్రీ ఇండస్ట్రీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు ధోనీ. అంటే సేంద్రీయ కోళ్లను పెంచబోతున్నాడన్నమాట. ఇప్పటికే 2వేల కోళ్లకోసం ఆర్డర్ కూడా చేశాడు. మధ్యప్రదేశ్ లోని ఓ‌ గిరిజన రైతునుంచి కడక్.‌నాథ్ కోళ్లు కొనబోతున్నాడట ధోనీ. .

కొత్తొక వింత. పాతొక రోత. దేశవ్యాప్తంగా ఇప్పుడు కడక్.‌నాథ్ కోళ్లకు మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే ఈ రకం కోళ్ల మాంసంలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ తక్కువగా ఉండే కడక్.నాథ్ కోళ్లలో పోషకాలు మాత్రం ఎక్కువ. నార్మల్ చికెన్.‌లో కిలోకి 214 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్, 16 నుంచి 17 శాతం ప్రొటీన్లు ఉంటాయి. అయితే కడక్.‌నాథ్ చికెన్.‌లో కిలోకి 184 మిల్లీగ్రాముల కొవ్వుంటే, ప్రొటీన్లు మాత్రం ఏకంగా 27నుంచి 28 శాతందాకా ఉంటాయి. అన్ని పోషక విలువలు ఉండబట్టే కడక్.‌నాథ్ చికెన్ కిలో 700 నుంచి వెయ్యి రూపాయలదాకా పలుకుతోంది. ఆ జాతి కోడి పిల్ల ఖరీదే వందకు తక్కువుండదు.

మామూలుగా ఐదురూపాయలకో కోడి గుడ్డు దొరుకుతుంది. కానీ కడక్.నాథ్ కోళ్లు పెట్టే గుడ్డు విలువ 50 రూపాయలు. పైగా అది మిగిలిన గుడ్లలా తెల్లగా ఉండదు. నలుపు రంగులో ఉండే కడక్.నాథ్ కోడిగుడ్డులో ఔషధ గుణాలుంటాయి. ఇన్ని ప్రత్యేకతలు ఉండబట్టే….కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలీ అనుకుంటూ….కడక్.నాథ్ కోళ్లని పెంచబోతున్నాడు ఏ బాల్.ని ఎలా కొట్టాలో, ఏ క్యాచ్.ని ఎలా పట్టాలో తెలిసిన ధోనీ. అందుకే మధ్యప్రదేశ్.లోని గిరిజన ప్రాంతాలకే ప్రత్యేకమైన ఈ కోళ్లను ముందు జార్ఖండ్.లో పెంచడం మొదలుపెట్టి…నెమ్మదిగా బిజినెస్ విస్తరించాలనుకుంటున్నాడు. ఆలోచన అదిరింది కదూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here