Home News Politics

ఆ ఎంపీ స్టైల్ తో సీఎం సొంత జిల్లాలో టిక్కెట్ల పంచాయతీ…!

ఆయనకు డిఫరెంట్‌ ఇమేజ్‌ ఉంది.. ఏది చేసినా సినిమా స్టైల్లో వెరైటీగా చేస్తుంటారాయన.. ఆ క్రమంలో ఫోకస్‌ పెరగడంతో ఒకానొక దశలో పార్టీ అధిష్టానంపైనే తిరుగుబాటు చేసిన చరిత్ర ఆయనది.. రెండు సార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన సదరు నేతకు వచ్చే ఎన్నికల్లో కూడా టికెట్‌కు ఢోకా లేనట్లే కనిపించింది.. అయితే సొంత ఇంట్లో మొదలైన సరికొత్త పితలాటకం ఆయనకు మైనస్‌ అయ్యేలా ఉందంటున్నారు .. తన అల్లుళ్లకు టికెట్ల కోసం చేస్తున్న ప్రయత్నాలతో … అసలు ఆయన్నే పక్కన పెట్టేస్తే సమస్య తీరిపోతుందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి .. దాంతో ఇదెక్కడి గోలరా అని అల్లాడుతున్నారు బాబు క్లాస్ మెట్,బెస్ట్ ఫ్రెండ్ అని చెఫ్పుకునే చిత్తూరు ఎంపీ….

చిత్తూరు ఎంపిగా టికెట్ వస్తే చాలు ఈజీగా ఇక్కడ నుంచి విజయం సాధించవచ్చన్న అభిప్రాయం టీడీపీ నేతల్లో ఉంది…అందుకు కారణం కుప్పం లో టీడీపీకి వచ్చే మెజార్టీతో పాటు చిత్తూరు పార్లమెంట్ పరిధిలో వున్న అసెంబ్లీ నియోజకవర్గాలలో టీడీపీ బలమైన ఓటు బ్యాంక్ ఉండటం ఎంపీ క్యాండెట్‌కు ప్లస్‌ అవుతుందని పార్టీ శ్రేణులు లెక్కలు వేసుకుంటుంటాయి … ప్రస్తుత ఎంపి శివ ప్రసాద్ తో పాటు గతంలో ఇక్కడ నుంచి ప్రాతినిద్యం వహించిన అదికేశవుల నాయుడు, రామకృష్ణారెడ్డిలు సునాయస విజయం సాధిచడానికి అదే కారణమని తమ్ముళ్లు అంటుంటారు…తాజాగా ఇదే స్థానం నుంచి ముచ్చటగా మూడో సారి బరిలో దిగాలని ఎంపీ శివ ప్రసాద్ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పుడు ఎంపీ శివ ప్రసాద్ కు అల్లుళ్ల రూపంలో కొత్త చిక్కు వచ్చి పడిందంట … ఇద్దరు అల్లుళ్లు శాసనసభ టికెట్లు కావాలని మామపై వత్తిడి తేస్తున్నారంట .. పెద్ద అల్లుడు వేణు గతంలో తన మామ ప్రాతినిధ్యం వహించిన సత్యవేడు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు … ఇప్పుడు అక్కడున్న సిట్టింగ్ ఎంఎల్ఎ తలారి అదిత్య పై పార్టీ పరంగా వ్యతిరేకత ఉందని.. తనకు అక్కడ అవకాశం ఇప్పించాలని వేణు వత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది… ఇక రెండవ అల్లుడు నరసింహా తనకు కడప జిల్లా రైల్వే కోడూరు నుంచి అవకాశం ఇప్పించమని మామపై వత్తిడి తీసుకువస్తూ … ఇప్పటికే ఆ నియోజకవర్గంలో ప్రచారపర్వానికి కూడా తెరలేపారు… అయితే అక్కడ ఇప్పటికే మూడు గ్రూపులు వుండటంతో … మరో గ్రూపు తయారైతే అసలుకే మోసం వస్తుందని స్థానిక నేతలు కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారంట..

స్వతహాగా శివప్రసాద్‌ సీని కళాకారుడు .. ఆయన అల్లుళ్లు నాటకాలు ,షార్ట్ పిల్మ్స్ అంటు హాడావుడి చేస్తుంటారు… కొంతకాలం క్రితం శివ ప్రసాద్ పెద్ద కూతురు తిరుపతిలో జరిగిన ట్రాఫిక్ గొడవలో తనకు న్యాయం జరగలేదని సీఎంనే టార్గెట్ చేసి మాట్లాడారు … అప్పట్లో ఎంపీ కూడా కుమార్తెకు వత్తాసుగా మాట్లాడటం చర్చనీయాంశమైంది… ఇక తర్వాత జరిగిన పరిణామాలు కూడా టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టాయి… శివప్రసాద్‌ కుటుంబసభ్యులు భూ కబ్జాలు చేసారంటూ పెద్ద ఎత్తున మీడియాలో వార్తలు కూడా వచ్చాయి… రామచంద్రాపురం మండలంలో జరిగిన భూదందా వ్యవహారం ఇప్పుడు రెవెన్యూ పరిధిలో విచారణ జరుగుతుంది… దీంతో పాటు వివాదస్పద భూముల వ్యవహారంలో పంచాయితీలు జరిగాయంటూ పెద్ద ఎత్తున శివ ప్రసాద్ అల్లుళ్ల పై ప్రచారం జరిగింది….

ఇదంతా ఒక ఎత్తు అయితే చంద్రబాబు పై శివప్రసాద్ నేరుగా విమర్శలు చేయడం సంచలనం రేపింది… తాను సీఎం నియోజకవర్గం కుప్పం ఓట్లతో గెలవలేదని సొంత ఇమేజ్ తో గెలిచానని అప్పట్లో శివ ప్రసాద్ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు … తన భార్య సామాజిక వర్గం కూడా సహాకరించడంతో తాను విజయాలు సాధిస్తున్నట్లు ప్రకటించుకున్నారు … అక్కడితో ఆగకుండా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎన్నో పార్టీలు వుంటాయని శివప్రసాద్ బెదిరింపు ధోరణితో మాట్లాడారు.. దాని పై చిత్తూరు టీడీపీ నేతలు ఇప్పటికీ ఆగ్రహంగానే ఉన్నారు..

గత ఎన్నికల్లో చంద్రగిరి, నగరిలలో టీడీపీ అభ్యర్థులు ఓటమి పాలయినా అక్కడ శివప్రసాద్‌కు మెజార్టీ వచ్చింది.. దాంతో ఆయన క్రాస్ ఓటింగ్ ను ప్రోత్సాహించారని అప్పట్లో గాలి ముద్దుకృష్ణమనాయుడుతో పాటు గల్లా అరుణలు నేరుగా సిఎంకు ఫిర్యాదులు చేసారు … ఇన్ని నెగిటివ్‌లు ఉన్న శివప్రసాద్ తన సీటు తిరిగి దక్కించుకోవడానికి అల్లాడుతుంటే.. ఆయన అల్లుళ్లు అసెంబ్లీ టికెట్ల కోసం వత్తిడి పెంచుతుండటం ఆయనకు పెద్ద తల నొప్పిగా మారిందంట…. మొత్తం మీద చిత్తూరు , కడప జిల్లాలలో రాజకీయంగా జెండా పాతాలని శివ ప్రసాద్ ప్యామీలి ప్రయత్నిస్తుండటం పోలిటికల్ సర్కిల్ లో చర్చనీయాంశంగా మారింది… ఒక ఎంపీ, రెండు ఎమ్మెల్యే టికెట్లు అడుగుతున్న ఆ ఫ్యామిలీకి చివరికి ఏం దక్కుతుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here