జైలు నుంచి విడుదలైన ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాలు,సీబీఐ కోర్టులో జగన్ కౌంటర్ పై స్పందించారు. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ దాఖలులో తనకు ఏ స్వార్థం లేదన్నారు. జగన్ కౌంటర్లో తనపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమన్నారు. కచ్చితంగా న్యాయం జరుగుతుందని భావిస్తున్నా అని ఆయన అన్నారు.
సీబీఐ కోర్టులో జగన్ కౌంటర్ పేలవంగా ఉందని రఘురామరాజు వ్యాఖ్యానించారు. పైనున్న వెంకటేశ్వరస్వామి అన్నీ చూసుకుంటారని ఆశిస్తున్నానని, తన ఆరోగ్యం కోసం, బెయిల్ కోసం ప్రార్థించిన అందరికి పాదాభివందనాలు అని రఘురామ తెలిపారు.