Home News

ఆ మర్డర్ కేసులో మంత్రి హస్తం: ఎంపీ అరవింద్ సంచలన ఆరోపణలు

నిజామాబాద్ బాల్కొండకి చెందిన యువకుడు సిద్దార్ద మృతి కేసు కొత్త మలుపు తిరుగుతుంది. కేసుని పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని పోలీసుల పై ఏకంగా సిద్దార్ధ కుటుంబ సభ్యులు దాడి చేశారు. దీంతో వివాదం మొదలైంది. అయితే సిద్దార్ద్ మృతి వెనుక మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. బీజేపీలో చురుగ్గా ఉంటున్నందుకే సిద్ధార్థ‌ను టీఆర్ ఎస్ నాయ‌కులు, మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి హ‌త్య చేయించార‌ని ఆరోపించారు.

నిజామాబాద్ జిల్లాలో మంత్రి ప్రశాంత్ రెడ్డి తమ్ముడు య‌థేచ్చ‌గా గంజాయి దందా చేస్తున్నాడ‌ని ఫైర్ అయ్యాడు ఎంపీ అరవింద్. మంత్రి సపోర్ట్ తోనే ఈ హత్య జరిగిందని హ‌త్య చేసిన వ్య‌క్తికి జైల్లో పోలీసులు బిర్యానీ పెడుతున్నార‌ని, అత‌డు ఫేస్‌బుక్ స్టేట‌స్‌లు ఎలా పెడుతున్నాడంటూ మండిప‌డ్డారు. సిద్ధార్థ కుటుంబీకుల‌ను ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్‌ పరామ‌ర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here