Home Entertainment Cinema

అఖిల్ అక్కినేని.. ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్..

కెరీర్‌లో ఇప్పటి వరకు మూడు సినిమాలు చేసినా ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయాడు అఖిల్. కొండంత ఫ్యామిలీ అండ ఉన్నా కూడా కథల కరువుతో అఖిల్ విజయానికి మెట్టు దూరంలోనే ఆగిపోతున్నాడు. హలో సినిమాకు మంచి టాక్ వచ్చినా కూడా నిలబడలేకపోయింది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను సినిమాకు కూడా పర్లేదనే టాక్ వచ్చినా కూడా అది కూడా హిట్ కాలేదు. ఇ

క అఖిల్ తొలి సినిమా అఖిల్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈ చిత్రం భారీ అంచనాలతో వచ్చి దారుణంగా ఫ్లాప్ అయింది. వినాయక్. విక్రమ్ కే కుమార్ లాంటి దర్శకులు కూడా అఖిల్ కెరీర్ ను చక్కబెట్టలేకపోయారు. ఇక ఇప్పుడు మరోసారి డిజాస్టర్ డైరెక్టర్ ను నమ్ముకుని వస్తున్నాడు అఖిల్. ఈయన నాలుగో సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది. పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమా టైటిల్ ఏంటనేది కొన్ని రోజులుగా బయట ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు చాలా పెద్ద టైటిల్ పెట్టారని తెలుస్తుంది. అదే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. అవును.. ఇప్పుడు నిజంగానే అఖిల్ ఇదే అంటున్నారు. విజయ్ దేవరకొండ ఇప్పటికే వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ వస్తే..

ఇప్పుడు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అంటున్నాడు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 నిర్మిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. పైగా వరస ఫ్లాపుల్లో ఉన్న భాస్కర్ ను నమ్మడం కూడా ఆసక్తి పెంచేస్తుంది. కథ బాగుంటే తప్ప అల్లు అరవింద్ కనీసం కంపౌండ్ లోకి కూడా రానివ్వడు. కానీ ఇప్పుడు భాస్కర్ చేసాడంటే మాత్రం కచ్చితంగా అందులో చాలా విషయం ఉందని అర్థమైపోతుంది. ఈ మధ్య భారీ టైటిల్స్ పెడితే సినిమాలు హిట్ అవుతున్నాయి. ప్రతిరోజూ పండగే.. సరిలేరు నీకెవ్వరు.. అల వైకుంఠపురములో.. ఇదే కోవలో ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ వస్తుంది. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here