Home News

మైహోం,మేగా పై మోజో రేవతి సెటైర్లు…!

తెలంగాణలో కార్పోరేట్ శక్తులు జర్నలిజాన్ని శాసిస్తున్నాయన్నారు మోజో టీవీ మాజీ సీఈవో రేవతి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఈ ఉదయం రేవతిని అరెస్ట్ చేశారు. తన అరెస్ట్ పై ట్విట్టర్లో పలు పోస్టులు చేసింది రేవతి. తన అరెస్ట్ వెనుక మెగా సంస్థల అధినేత కృష్ణారెడ్డి, మై హోమ్ సంస్థ అధినేత రామేశ్వరరావు వున్నారని ఆరోపించారు. వారిద్దరూ తమ మేనేజ్ మెంట్ స్కిల్స్ అద్భుతంగా ఉపయోగించారని, నిజం ఇవాళ కాకపోయినా, రేపయినా వారి కుట్రాలు బయటకి వస్తాయి అన్నారు. ఓ జర్నలిస్ట్ ని వారెంట్ కూడా లేకుండా అరెస్ట్ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి టాప్ ప్రియారిటీగా కనిపిస్తోందని రేవతి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

జనవరిలో నమోదైన ఓ కేసులో తనను ఏ2గా చేర్చారని, తనకు కనీసం నోటీసులు ఇవ్వలేదని, వారెంట్ కూడా లేకుండా అరెస్ట్ చేయడానికి వచ్చారని ఆమె ఆరోపించారు. ఇదంతా ఏసీపీ కేఎస్ రావు ఆదేశాల మేరకు జరిగిందన్నారు. వారు తన ఫోన్ ను లాక్కునే ప్రయత్నం కూడా చేశారని, పోలీసులను వీడియో తీయబోతే అడ్డుకున్నారని ట్విట్టర్ లో పేర్కొన్నారు. కనీసం తన బిడ్డను స్కూలుకు పంపించేందుకు సమయం ఇవ్వాలని కోరినా అంగీకరించలేదని, తానేమీ టెర్రరిస్ట్ ను కాదన్నారు. కార్పోరేట్ శక్తుల పిడికిలి నుంచి జర్నలిజాన్ని కాపాడుకునేందుకు దేనికైన సిద్దమే అన్నారు రేవతి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here