Home Health corona

కరోనా సమీక్షలో కన్నీళ్లు పెట్టుకున్న మోడీ

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన వైద్యులు,కార్మికులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. కరోనా విజృంభిస్తున్న వేళ వారు చేస్తున్నసేవలకు, ధైర్యసాహసాలను అభినందించారు. ఒక సమయంలో భావోద్వేగానికి గురైన మోడీ కన్నీటి పర్యంతమయ్యారు. కరోనా పేషెంట్లకు సేవలందిస్తు బలైన కార్మికుల కుటుంబాలకు ఫ్రంట్ లైన్ వారియర్స్ కి సంతాపం వ్యక్తం చేశారు.

గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,59,591 కరోనా కేసులు నమోదు కాగా, 4,209 మంది కరోనాతో మృతి చెందారు. దేశంలో మొత్తం 2 కోట్ల 60 లక్షల 31 వేలకు కరోనా కేసులు చేరుకున్నాయి. ప్రస్తుతం దేశంలో 30,27,925 యాక్టివ్ కేసులు ఉండగా, కరోనాతో 2,91,331 మరణాలు సంభవించాయి. దేశ వ్యాప్తంగా 14,82,754 మందికి వ్యాక్సిన్‌ తీసుకున్నారని, భారతదేశంలో యాక్టివ్ కేసులు 11.63 శాతం, మరణాల రేటు 1.12 శాతం ఉన్నట్లు శుక్రవారం కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here