Home News

వెంటనే ఎమ్మెల్యే విద్యాసాగర్ క్షమాపణ చెప్పాలి

కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చేసిన కామెంట్లపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రామచందర్రావు ఘాటుగా స్పందించారు. రామమందిరానికి చందాలివ్వొద్దని ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. వెంటనే ప్రజలకు తెరాస ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. రామాలయం నిర్మాణం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర దేశ వ్యాప్తంగా విరాళాలు చేపట్టిందని వారు తెలుపుతూ..చందాలకోసం బీజేపీ ఎవరిపైనా ఒత్తిడి చేయడం లేదని స్పష్టం చేశారు.

అయోధ్యలో రామాలయం నిర్మాణం ప్రతి హిందువు కల అని..రామ మందిరాన్ని నిర్మాణం కోసం అనేక మంది ముందుకు భక్తులు వచ్చారన్నారని పేర్కొన్నారు. ప్రతి హిందువును భాగస్వామ్యం చేయాలనే నిధి సేకరిస్తున్నామని రాజాసింగ్ చెప్పారు. బొట్టు పెడితేనే హిందువా ? బీజేపీ వాళ్ళు కలెక్షన్లు చేస్తున్నారు.. ఒక్క రూపాయి ఇవ్వవద్దు అని టిఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పడం సిగ్గు చేటని వారు అన్నారు. ఎమ్మెల్యే విద్యాసాగర్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు.

కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చేసిన వ్యాఖ్యలపై అటూ బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్ రావు కూడా ఘాటుగానే స్పందించారు. విద్యాసాగర్ రావు చేసిన వ్యాఖ్యలు ఆయన సొంత వ్యాఖ్యలా…? టీఆర్ఎస్ పార్టీదా ? స్పష్టం చేయాలన్న ఆయన ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చి విరాళాలు ఇస్తుంటే ఈయనకు అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే విరాళాలు సేకరిస్తున్నారని..ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. విద్యాసాగర్ వ్యాఖ్యలు దేశ వ్యతిరేఖ వ్యాఖ్యలుగా భావించాల్సి వస్తుందని రామచందర్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here